Super Earth: భూమిని పోలిన మరో గ్రహం గుర్తింపు.. మన గ్రహానికి 37 కాంతి సంవత్సరాల దూరంలో..
Super Earth (Image Credits: IndiaToday)

Newyork, August 5: జనాభా (Population) విస్పోటం, కాలుష్యం (Pollution) పెరిగిపోవడంతో భూమిని పోలినటువంటి మరే ఇతర గ్రహాలైనా విశ్వంలో ఉన్నాయా? అనే వివరాలు తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో భూమికి 37 కాంతి సంవత్సరాల దూరంలో ఓ గ్రహాన్ని కనుగొన్నారు. దాని పేరు రాస్‌ 508బీ. సూపర్‌ ఎర్త్‌ (Super Earth) అని కూడా పిలుస్తున్నారు. కారణం భూమిపై ఉన్న వాతావరణమే.. ఈ గ్రహంపై ఉండే అవకాశాలు మెండుగా ఉండటం. సూర్యుడి (Sun)కి భూమి మధ్య దూరం కంటే కేవలం 0.05 రెట్లు ఎక్కువ దూరంలోనే రాస్‌ 508బీ తన నక్షత్రం(Star)తో ఎడంగా ఉన్నదని పరిశోధకులు తెలిపారు. దీంతో ఆ గ్రహంపై నీరు ఉండే అవకాశం లేకపోలేదంటున్నారు. జీవం ఉండటానికి కూడా పరిస్థితులు దోహదపడొచ్చని అభిప్రాయపడుతున్నారు.

విషాదం అంటే ఇదే.. పాముకాటుతో అన్న మృతి, అంత్యక్రియల కోసం వచ్చిన తమ్ముడిని కూడా కాటేసిన పాము, యూపీలో కేసు వెలుగులోకి

భూమి కంటే నాలుగు రెట్లు ఎక్కువ బరువుతో ఉన్న ఈ గ్రహం అక్కడి నక్షత్రం చుట్టూ ఒకసారి పరిభ్రమణం చేయడానికి 10.8 రోజులు పడుతుంది. ఒకవేళ ఈ గ్రహంపై జీవనానికి అనుకూల పరిస్థితులు ఉంటే, అది భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు చేస్తుందని అంటున్నారు.