Delhi Air Pollution: ఢిల్లీలో మళ్లీ భారీగా పెరుగుతున్న వాయు కాలుష్యం, బాణసంచా, చెత్తను కాల్చడాన్ని పూర్తిగా నిషేధించే ఆలోచనలో కేజ్రీవాల్ సర్కారు
Representational image (Photo Credits: ANI)

New Delhi, Oct 23: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం మళ్లీ తీవ్రరూపం దాల్చుతోంది. సోమవారం ఢిల్లీలో గాలి నాణ్యత ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 309గా నమోదైంది. అదే సమయంలో ఢిల్లీలో ఎన్‌సీఆర్ పరిధి‌లో గాలి నాణ్యత పడిపోయింది. ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 322గా నమోదైందని సఫర్‌ తెలిపింది.

పొగమంచు కారణంగా అసలేమి కనిపించడం లేదని వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. ఢిల్లీలోని ఆనంద్‌ విహార్‌, హసన్‌పూర్‌ డిపో, తొమ్మిదో నెంబర్‌ జాతీయ రహదారి పొగ మంచు భారీగా పేరుకుపోయింది. ఫలితంగా రోడ్లపై ఎదురుగా వచ్చే వాహనాలు సైతం కనిపించడం లేదు.నెహ్రూ పార్క్‌, తీన్‌మూర్తి మార్గ్‌ చుట్ట పక్కల ప్రాంతాల్లోను,ఇండియా గేట్, డ్యూటీ పత్‌లోనూ పొగమంచు పేరుకుపోయింది.

హార్ట్‌ఎటాకే బలి తీసుకుందా, జిమ్‌లో వ్యాయామం చేస్తూ కుప్పకూలిన డీఎస్పీ, ఆస్పత్రికి వెళ్లేలోగానే మృతి

మరో వైపు ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యం మధ్య పర్యావరశాఖ మంత్రి గోపాల్‌రాయ్‌ అధికారులతో తెలిపారు. దేశ రాజధానిలో చలి పెరుగుతోందని, గాలి వేగం తగ్గిందని పేర్కొన్నారు. ఢిల్లీలో రెండోగ్రాఫ్‌ అమలు చేసేందుకు అన్నిశాఖల అధికారులతో సోమవారం మంత్రి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అయితే, ఇప్పటికే పొరుగు రాష్ట్రాల మంత్రులతో మాట్లాడి.. వరి కొయ్యలు, పొట్టు, వ్యర్థాలను తగులబెట్టకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

అయితే, ఇండియా గేట్‌ దగ్గర పలువురు మాట్లాడుతూ 10-12 నుంచి నుంచి ఢిల్లీలో కాలుష్యం పెరుగుతోందన్నారు. పొగదట్టంగా ఉందని.. పరిస్థితి ఏమాత్రం బాగోలేదన్నారు. సైక్లిస్టులంతా మాస్క్‌లతోనే తిరుగుతున్నామన్నారు. రాబోయే రోజుల్లో ఇదే పరిస్థితి కొనసాగితే సైకిల్‌ తొక్కడం మానేసి ప్రత్యామ్నాయంగా వ్యాయామాలు చేస్తామని సైక్లిస్ట్‌ తెలిపారు.

గాజాలో కొనసాగుతున్న మారణహోమం, ఆస్పత్రిలో బాంబు దాడుల్లో 500 మంది మృతి, 11 రోజుల్లో ఏకంగా 3వేల మంది అమాయకులు మరణించినట్లు లెక్కలు

సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) డేటా ప్రకారం జహంగీర్‌పురి ప్రాంతంలో AQI గరిష్టంగా 349కి చేరుకుంది. వాయు నాణ్యత సూచి 0-50 మధ్య ఉంటే "మంచిది", 51-100 "సంతృప్తికరమైనది", 101-200 "మితమైన", 201-300 "పేలవమైనది", 301-400 "చాలా పేలవమైనది", 401-500 "తీవ్రమైనది"గా పరిగణిస్తారు. 500 కంటే ఎక్కువ AQI "తీవ్రమైన ప్లస్" విభాగంలోకి వస్తుంది.

ఢిల్లీలో చివరిసారిగా మే 17న వాయు నాణ్యత సూచీ 336 పాయింట్లు నమోదైంది. ఢిల్లీలో గాలి నాణ్యత తగ్గుతోందనే ఆందోళనల మధ్య.. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) రెండో దశలో వివరించిన విధంగా, జాతీయ రాజధాని పరిధిలో (NCR) 11-పాయింట్ల యాక్షన్ ప్లాన్‌ను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వ నేతృత్వంలోని ప్యానెల్ ఇప్పటికే నిర్ణయించింది. ఏక్యూఐ సూచీ విలువ 301వ పాయింట్ ని తాకితే ఎన్‌సీఆర్ ప్రాంతంలో యాక్షన్ ప్లాన్ అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కాలుష్యాన్ని నియంత్రించడానికి ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే పలు అవేర్ నెస్ కార్యక్రమాలు నిర్వహించింది.

నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR)లో క్రాకర్స్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని ఢిల్లీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. దీపావళి సందర్భంగా ఏర్పడే వాయు కాలుష్యాన్ని అరికట్టడమే ధ్యేయంగా ఢిల్లీ, పంజాబ్, హరియాణా, యూపీ, రాజస్థాన్ రాష్ట్రాల పర్యావరణ శాఖ మంత్రులతో కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్(Bhupender Yadav) రెండు రోజుల క్రితం సమావేశం నిర్వహించారు.

ఢిల్లీలో ఏర్పడుతున్న కాలుష్యంలో 31 శాతం రాజధానిలోని పలు ప్రాంతాల నుంచి ఏర్పడగా, 69 శాతం ఎన్ సీఆర్ రాష్ట్రాల నుంచే వస్తోంది. ఎన్ సీఆర్ పరిధిలోకి వచ్చే రాష్ట్రాల్లో పొల్యూషన్ ని కంట్రోల్(Pollution Control) చేయకపోతే ఢిల్లీలో పరిస్థితి మారదని మంత్రి రాయ్ అన్నారు.

బాణసంచా, చెత్తను కాల్చడాన్ని పూర్తిగా నిషేధించాలని.. సీఎన్‌జీ(CNG), ఎలక్ట్రిక్ వాహనాలను(EV) మాత్రమే వాడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పరిశ్రమల్లో కాలుష్య ఇంధనాలను ఫైన్డ్ నేచురల్ గ్యాస్ గా మార్చాలని, ఇటుక బట్టీల పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి జిగ్ జాగ్ టెక్నాలజీ ఉపయోగించాలని.. డీజిల్ జనరేటర్లపై ఆధారపడకుండా ఎన్ సీఆర్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో విద్యుత్ అందుబాటులో ఉంచాలని కోరారు.