Gaza, OCT 18: గాజా నగరంలో దారుణం జరిగింది. ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో గాజా (Airstrike On Gaza Hospital) నగరంలోని ఆసుపత్రిలో 500మంది మరణించారు. మంగళవారం గాజా ఆసుపత్రిలో జరిగిన పేలుడులో 500 మంది పాలస్తీనియన్లు మరణించారు. ఇజ్రాయెల్ వైమానిక దాడి వల్ల మరణాలు సంభవించినట్లు పాలస్తీనా ఆరోగ్య అధికారులు చెప్పారు. అయితే పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ చేసిన రాకెట్ ప్రయోగం విఫలమైందని ఇజ్రాయెల్ సైన్యం చెబుతోంది. అక్టోబరు 7వతేదీన దక్షిణ ఇజ్రాయెల్ కమ్యూనిటీలపై జరిగిన ఘోరమైన హమాస్ దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ జనసాంద్రత కలిగిన భూభాగంపై ఎడతెగని బాంబు దాడులను ప్రారంభించింది. గాజాలో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడి అత్యంత రక్తపాత సంఘటనగా పాలస్తీనా పేర్కొంది. యూఎస్ ప్రెసిడెంట్ జో బిడెన్ ఇజ్రాయెల్‌ను సందర్శించిన తర్వాత ఈ వైమానిక దాడి (Airstrike On Gaza Hospital) జరిగింది. గాజాలోని హమాస్ (Hamas) ప్రభుత్వంలోని ఆసుపత్రిలో ఊచకోత కోశారని ఆరోగ్య మంత్రి మై అల్కైలా ఆరోపించారు. ఈ దాడిలో 500 మంది మరణించారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారి తెలిపారు. ఇజ్రాయెల్ 11 రోజుల బాంబు దాడిలో 3,000 మంది మరణించారని గాజాలోని ఆరోగ్య అధికారులు చెప్పారు.
A blast ripped through a Gaza hospital killing hundreds of people late Tuesday, sparking global condemnation and violent protests in several Muslim nations.
Israel and Palestinians have traded blame for the incident
For the latest: https://t.co/Q9ShADSQpw pic.twitter.com/3HyYOzALvX
— AFP News Agency (@AFP) October 18, 2023
అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పట్టణాల్లోకి హమాస్ మిలిటెంట్లు సాగించిన విధ్వంసంలో 1,300 మందికి పైగా మరణించారు. ఇజ్రాయెల్ సైన్యం గాజా నగరంలోని అల్-అహ్లీ అల్-అరబీ ఆసుపత్రిలో జరిగిన పేలుడుకు బాధ్యతను నిరాకరించింది. గాజాలో ఉగ్రవాదులు రాకెట్ల బారేజీని పేల్చారని, అది దెబ్బ తిన్న సమయంలో గాజాలోని అల్ అహ్లీ ఆసుపత్రిలో రోగులు మరణించారని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రతినిధి తెలిపారు.
#BREAKING Palestinian militant group Islamic Jihad says Israeli army accusations that it was responsible for Gaza hospital strike are 'false and baseless' pic.twitter.com/Mq5qzy6sAB
— AFP News Agency (@AFP) October 17, 2023
ఇజ్రాయెల్ బాంబు దాడుల వల్ల రోగులు, మహిళలు, పిల్లలు నిరాశ్రయులయ్యారు. పేలుడు తర్వాత బిడెన్‌తో జరగాల్సిన సమావేశాన్ని అబ్బాస్ రద్దు చేసుకున్నట్లు పాలస్తీనా సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. పాలస్తీనా ప్రధాని ఈ వైమానిక దాడిని భయంకరమైన నేరం, మారణహోమం అని అభివర్ణించారు. ఇజ్రాయెల్‌కు మద్దతు ఇచ్చే దేశాలు కూడా దీనికి బాధ్యత వహిస్తాయని ప్రధాని పేర్కొన్నారు.