Mehaboob Dilse : బిగ్ బాస్ ఫేం మెహబూబ్ ఇంట్లో విషాదం.. తల్లిని కోల్పోవడంతో ఎమోషనల్ పోస్ట్
బిగ్‌బాస్ కంటెస్టెంట్ మెహబూబ్ తల్లి మృతి.. బాధతో పోస్ట్ పెట్టిన నటుడు.. ధైర్యంగా ఉండాలంటూ నెటిజన్ల కామెంట్స్
Hyderabad, August 7: బిగ్‌బాస్ (Bigboss) కంటెస్టెంట్ మెహబూబ్ దిల్‌సే (Mehaboobdilse) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. గుండెపోటుతో మెహబూబ్ తల్లి మరణించింది. తల్లి మృతి పట్ల మెహబూబ్ ఓ భావోద్వేగ పోస్టు (Post)ను షేర్ చేశాడు. 'అమ్మా.. నువ్వు నన్ను ఒంటరిగా వదిలి వెళ్లిపోయావ్.. ఇకపై నేను నిర్ణయాలు ఎలా తీసుకోవాలి? ప్రతిరోజూ నేను ఎవరితో మాట్లాడాలి? నువ్వు లేకుండా ఎలా బతకాలి అమ్మీ(అమ్మా)? జీవితం అంటే ఏంటో నేర్పించావు. నువ్వు ఎక్కడున్నా నన్ను చూస్తుంటావని తెలుసు. నిన్ను గర్వపడేలా చేస్తానమ్మా. తమ్ముడు, డాడీని బాగా చూసుకుంటా. నా హృదయంలో నీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. నిన్ను ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను' అంటూ మెహబూబ్ ఎమోషనల్ (Emotional) పోస్ట్ ను షేర్ చేశాడు.
ఇది చూసిన పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు (Netizens) స్టే స్ట్రాంగ్ మెహబూబ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
(The above story first appeared on LatestLY on Aug 07, 2022 08:50 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

