Ketki dave: భర్త చనిపోయిన రెండు రోజులకే.. వర్క్ లోకి నటి.. వృత్తిపట్ల నిబద్ధతకు ఇది తార్కాణం అంటూ నెటిజన్ల ప్రశంసలు..
భర్త చనిపోయిన రెండు రోజులకే షూటింగ్‌లో పాల్గొన్న నటి కేత్కి దేవ్.. ముందుగానే డేట్స్ ఇచ్చేసిన కారణంగా తన వల్ల ఎవరూ ఇబ్బంది కూడదనే ఈ విధంగా చేసినట్లు వెల్లడి. తన జీవితంలో ఏర్పడిన దుఃఖం ఇతరులపై ప్రభావం చూపకూడదని వివరణ
Mumbai, August 7: కొందరు నటీనటులు వృత్తిపట్ల అచంచలమైన నిబద్ధత కనబరుస్తారు. తమవల్ల నిర్మాతలు నష్టపోకూడదని వ్యక్తిగత విషయాలు, బాధలను కూడా దిగమింగుకొని పరుల గురించి ఆలోచిస్తారు. ఈ కోవలో ముందుంటారు నటి కేత్కి దేవ్ (Ketki dave) . బాలీవుడ్ సీనియర్ నటుడు రసిక్ దేవ్ (Rasik Dave) కిడ్నీ ఫెయిల్యూర్‌తో వారం క్రితం కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే భర్త చనిపోయిన రెండు రోజులకే నటి కేత్కి దేవ్ షూటింగ్ (Shooting)లో పాల్గొంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె వెల్లడించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కేత్కి దేవ్.. భర్త చనిపోయినప్పటికీ ఎటువంటి బ్రేక్ తీసుకోలేదని పేర్కొంది. ముందుగానే డేట్స్ ఇచ్చేసిన కారణంగా తన వల్ల ఎవరూ ఇబ్బంది కూడదనే ఈ విధంగా చేసినట్లు తెలిపింది. తన జీవితంలో ఏర్పడిన దుఃఖం ఇతరులపై ప్రభావం చూపకూడదని పేర్కొంది.
వృత్తిపట్ల కేత్కి దేవ్ నిబద్ధతను నెటిజన్లు (Netizens) ప్రశంసిస్తున్నారు. మేడం మీ అంకితభావానికి సెల్యూట్ అంటూ పోస్టులు పెడుతున్నారు.
(The above story first appeared on LatestLY on Aug 07, 2022 08:24 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

