మెగాస్టార్ చిరంజీవి సీతారామం, బింబిసార చిత్రాలు ఘ‌న విజ‌యం సాధించ‌డంతో మేక‌ర్స్‌కు సోష‌ల్ మీడియా ద్వారా అభినంద‌న‌లు తెలిపాడు. ఈ సందర్భంగా చిరు ట్విట్ట‌ర్‌లో ‘ప్రేక్ష‌కులు సినిమా థియేట‌ర్లకి రావ‌డం లేద‌ని బాధ‌ప‌డుతున్న ఇండ‌స్ట్రీకి ఎంతో ఊర‌ట‌నీ మ‌రింత ఉత్సాహాన్నిస్తూ, కంటెంట్ బావుంటే ప్రేక్ష‌కులెప్పుడూ ఆద‌రిస్తార‌ని మ‌రోసారి నిరూపిస్తూ నిన్న విడుద‌ల‌యిన చిత్రాలు రెండు విజ‌యం సాధించ‌టం ఎంతో సంతోష‌క‌రం. ఈ సంధ‌ర్భంగా సీతారామం, బింబిసార చిత్రాల న‌టీన‌టులకు, నిర్మాత‌ల‌కు, సాంకేతిక నిపుణులంద‌రికీ నా మ‌న: పూర్వ‌క శుభాకాంక్ష‌లు’ అంటూ ట్విట్ట‌ర్‌లో తెలిపాడు. చిరంజీవి ప్ర‌స్తుతం మోహ‌న్‌రాజా ద‌ర్శ‌క‌త్వంలో గాడ్‌ఫాద‌ర్ చిత్రాన్ని చేస్తున్నాడు. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం అక్టోబ‌ర్ 5న విడుద‌ల కానుంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)