Viral Video: నేను చెప్పిన పాట వేయలేదు, పెళ్లి పీఠలు ఎక్కనని తెగేసి చెప్పిన పెళ్లి కూతురు, షాక్ తిన్న వధువు తల్లిదండ్రులు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పెళ్లికూతురు బుంగమూతి వీడియో

ఈ మధ్య పెళ్లికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. పెళ్లి కూతురు లేదా పెళ్లి కొడుకు డ్యాన్స్ చేయడం, పెళ్లి వేడుకలో జరుగుతున్న కొన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. దీంతో ఇవి తెగ వైరల్ అవుతున్నాయి

Viral Video: నేను చెప్పిన పాట వేయలేదు, పెళ్లి పీఠలు ఎక్కనని తెగేసి చెప్పిన పెళ్లి కూతురు, షాక్ తిన్న వధువు తల్లిదండ్రులు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పెళ్లికూతురు బుంగమూతి వీడియో
Bride refuses to enter her wedding venue (Photo-Video Grab)

ఈ మధ్య పెళ్లికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. పెళ్లి కూతురు లేదా పెళ్లి కొడుకు డ్యాన్స్ చేయడం, పెళ్లి వేడుకలో జరుగుతున్న కొన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. దీంతో ఇవి తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా..ఓ పెళ్లి కూతురుకు (Bride) సంబంధించిన వీడియో మళ్లీ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

పెళ్లి మండపానికి (wedding venue) వచ్చిన నూతన వధువు..పెళ్లి మండపం ఎక్కడానికి నో (Bride refuses to enter her wedding venue) చెప్పింది. దీంతో అక్కడున్న వారు షాక్ తిన్నారు. ఎందుకు ఎక్కడం లేదని కారణం తెలిసి అందరూ షాక్ తినడంతో పాటు నవ్వేశారు. ఓ ఇంట పెళ్లి జరుగుతోంది. నూతన వధువు పైన అందంగా అలంకరించిన పూలతో కూడిన వస్త్రాన్ని పట్టుకుని కొంతమంది ముందుకు నడుస్తున్నారు. అందంగా అలంకరించుకుని పెళ్లి కూతురు చిరు నవ్వులు చిందిస్తూ..ముందుకొస్తోంది.

కండోమ్ లేదని పురుషాంగానికి సీల్ వేసుకుని సెక్స్, తరువాత చెట్ల పొదల్లో అపస్మారకంగా పడిన యువకుడు, చికిత్స పొందుతూ మృతి, గుజరాత్ అహ్మదాబాద్‌లో ఘటన

అకస్మాత్తుగా ఓ చోట ఆగిపోయింది. ముందుకు వెళ్లాలని బంధువులు కోరగా..తాను వెళ్లనని చెప్పేసింది. అసలు విషయం ఏమిటనీ అడిగారు. తాను ఎంట్రీ ఇస్తున్న సమయంలో..చెప్పిన పాటను ఎందుకు ప్లే చేయలేదు అని పెళ్లి కూతురు అమాయకంగా ప్రశ్నించడంతో అక్కడున్న వారు ముసిముసి నవ్వులు నవ్వారు.

Here's Viral Video

అక్కడున్న ఈవెంట్ ఆర్గనైజేర్స్ తో గొడవకు దిగింది. నేను పెళ్లి చేసుకోను..పెళ్లి మండపం ఎక్కను అంటూ బుంగమూతి పెట్టేసింది. చివ‌ర‌కు వధువు కుటుంబ స‌భ్యులు బతిమలాడి, ఓదార్చడంతో బుంగమూతి పక్కన పెట్టి పెళ్లి పీట‌లు మీద కూర్చింది. ది వెడ్డింగ్‌ బ్రిగేడ్‌ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేయగా ప్రస్తుతం ఇది సోషల్‌మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది. ఇది చూసిన నెటిజనులు మాత్రం నవ్వు అపుకోలేకపోతున్నారు.మూడు రోజుల కిందట పోస్టు చేసిన ఈ వీడియో వైరల్ అవుతోంది.

(The above story first appeared on LatestLY on Aug 25, 2021 02:34 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).