Karnataka Anganwadi Workers: ఇదేందయ్యా.. ఇది..? పిల్లలకు ప్లేట్లలో గుడ్లు పెట్టినట్టే పెట్టి ఆ వెంటనే లాగేసుకోవడం ఏంటి? కర్ణాటకలో అంగన్వాడీ సిబ్బంది నిర్వాకం.. వర్కర్, హెల్పర్ సస్పెండ్ (వీడియోతో)
కర్ణాటకలో అంగన్వాడీ సిబ్బంది తమ కక్కుర్తి బుద్దిని చూయించారు. కప్పాల్ జిల్లా కారంటాగి తాలూకా గుందుర్ గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో సిబ్బంది పిల్లల పట్ల అత్యంత అమానుషంగా వ్యవహరించారు.
Bengaluru, Aug 11: కర్ణాటకలో (Karnataka Anganwadi Workers) అంగన్వాడీ సిబ్బంది తమ కక్కుర్తి బుద్దిని చూయించారు. కప్పాల్ జిల్లా కారంటాగి తాలూకా గుందుర్ గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో సిబ్బంది పిల్లల పట్ల అత్యంత అమానుషంగా వ్యవహరించారు. భోజనంలో భాగంగా పిల్లల ప్లేట్లలో గుడ్లను (Boiled Eggs) పెట్టిన సిబ్బంది.. ఆ వెంటనే వారితో ప్రార్థన చేయించారు. దీనిని ఫోటోలు తీశారు. అంతే, ఫోటో సెషన్ ముగియగానే ఆ వెంటనే కొన్ని సెకన్ల వ్యవధిలో పిల్లల ప్లేట్ల నుంచి గుడ్లను అంగన్‌వాడీ హెల్పర్, వర్కర్ తీసేసుకున్నారు.
Two Anganwadi workers were suspended in Karnataka’s Koppal district after a video of them went viral in which they were seen taking back eggs from kids’ plates after being served.
The Anganwadi workers served eggs to the kids, recorded the video and then took back the eggs from… pic.twitter.com/vXpMu3UhCK
— IndiaToday (@IndiaToday) August 10, 2024
ఎందుకు చేశారంటే?
పిల్లలకు గుడ్లు పెట్టామని అధికారులకు చూపుకునేందుకే సిబ్బంది ఇలాంటి మోసం చేశారని సమాచారం. విషయం బయటకు పొక్కడంతో అంగన్‌వాడీ హెల్పర్, వర్కర్ ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
(The above story first appeared on LatestLY on Aug 11, 2024 12:54 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

