Stanford Byers Center partner with Telangana says CM Revanth Reddy(X)

Hyd, Aug 10:  తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సాగుతోంది. తన పర్యటనలో భాగంగా వివిధ రంగాల పారిశ్రామిక వేత్తలతో భేటీ అవుతున్నారు రేవంత్. తాజాగా స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. విద్య, నైపుణ్యాభివృద్ధి, హెల్త్‌ కేర్ రంగాల్లో పరస్పర సహకారంపై కంపెనీ ప్రతినిధులతో చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయనున్న లైఫ్ సైన్సెస్, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీల్లో భాగస్వామ్యం కావాలని కోరారు.

తెలంగాణ రాష్ట్రం, స్టాన్‌ఫోర్డ్ భాగస్వామ్యం వల్ల ప్రపంచవ్యాప్తంగా హెల్త్‌కేర్ రంగానికి ఉపయోగకరంగా ఉంటుందన్నారు. తెలంగాణలో స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ శాటిలైట్ సెంటర్ ఏర్పాటును పరిశీలించాలని కోరారు. తర్వాత కాలిఫోర్నియాలో గూగుల్ హెడ్ ఆఫీస్‌ను సందర్శించింది రేవంత్ రెడ్డి బృందం.

ప్రపంచంలో ప్రముఖ జంతు ఆరోగ్య సంస్థగా పేరొందిన జొయటిస్ కంపెనీ హైదరాబాద్​లో తమ కేపబులిటీ సెంటర్‌ను విస్తరించాలని నిర్ణయించింది. 2024 సెప్టెంబర్ నుంచి ఈ కార్యకలాపాలు ప్రారంభించనుంది. దీని వల్ల వందలాది మందికి కొత్త ఉద్యోగాలు లభిస్తాయి. కంపెనీ ప్రతినిధుల బృందంతో సీఎం రేవంత్ రెడ్డి టీమ్ భేటీ అనంతరం పెట్టుబడులకు ఓకే చెప్పింది. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనపై కేటీఆర్ ఆసక్తికర ట్వీట్, మాకైతే తెలంగాణ ఫస్ట్

Here's Tweet:

 హైదరాబాద్‌లో తమ జొయటిస్ ఇండియా కెపాబిలిటీ సెంటర్‌ను విస్తరించాలన్న నిర్ణయాన్ని సీఎం రేవంత్ రెడ్డి స్వాగతించారు. ఇండియాలో తమ కంపెనీ విస్తరణకు హైదరాబాద్ అనువైన ప్రాంతమని, తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం కావటం సంతోషంగా ఉందని జొయటిస్‌ కంపెనీ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కీత్ సర్‌బాగ్ అన్నారు.