brs-working-president-ktr-about-cm-revanth-reddy-america-tour(X)

Hyd, Aug 4:  తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటపై ఆసక్తికర ట్వీట్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. లంగాణ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం నుంచి భారీ బృందం అమెరికా, దక్షిణ కొరియా పర్యటనలకు వెళ్తున్నది. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డికి, మంత్రి శ్రీధర్‌బాబుకు నా శుభాకాంక్షలు. ఆల్‌ ది బెస్ట్‌ అన్నారు.

బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తాము చేసిన కృషి ఫలితంగా అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్‌కు వచ్చాయన్నారు. టీఎస్‌ఐపాస్‌తో భారీ ఎత్తున విదేశీ పెట్టుబడులను తీసుకొచ్చాం అన్నారు. వాటిని చూసి ఇవాళ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు రానుండటం సంతోషకరం అన్నారు.అమెరికాకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి, ఘన స్వాగతం, పెట్టుబడులే లక్ష్యంగా 10 రోజుల టూర్

Here's Tweet:

గత పదేళ్లలో రూ.4 లక్షల కోట్లకు పైగా ప్రైవేట్‌ రంగంలో ఉద్యోగాలను సృష్టించాం అని తెలిపిన కేటీఆర్, తాము స్థాపించిన బలమైన పునాదిపై తెలంగాణ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని కోరుకుంటున్నా అన్నారు కేటీఆర్.