Gang Rape: గురుగ్రామ్‌లో దారుణం.. హోటల్‌లో పదో తరగతి బాలికపై ఐదుగురి సామూహిక అత్యాచారం.. బాలికను బైక్‌పై ఎక్కించుకుని హోటల్‌కు తీసుకెళ్లిన ఇద్దరు స్నేహితులు.. అక్కడ మరో ముగ్గురితో కలిసి అత్యాచారం.. ఇద్దరి అరెస్ట్

హర్యానాలోని గురుగ్రామ్‌లో దారుణం జరిగింది. పదో తరగతి చదువుతున్న బాలికను బైక్‌పై హోటల్‌కు తీసుకెళ్లిన ఇద్దరు స్నేహితులు.. మరో ముగ్గురితో కలిసి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటి వరకు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.

Gang Rape: గురుగ్రామ్‌లో దారుణం.. హోటల్‌లో పదో తరగతి బాలికపై ఐదుగురి సామూహిక అత్యాచారం.. బాలికను బైక్‌పై ఎక్కించుకుని హోటల్‌కు తీసుకెళ్లిన ఇద్దరు స్నేహితులు.. అక్కడ మరో ముగ్గురితో కలిసి అత్యాచారం.. ఇద్దరి అరెస్ట్
Credits: Google

Gurugram, November 1: హర్యానాలోని (Haryana) గురుగ్రామ్‌లో (Gurugram) దారుణం జరిగింది. పదో తరగతి చదువుతున్న బాలికను (Girl) బైక్‌పై (Bike) హోటల్‌కు (Hotel) తీసుకెళ్లిన ఇద్దరు స్నేహితులు (Friends).. మరో ముగ్గురితో కలిసి సామూహిక అత్యాచారానికి (Gang Rape) ఒడిగట్టారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటి వరకు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారి కథనం ప్రకారం.. శనివారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో బయటకు వెళ్లిన బాలిక రాత్రయినా ఇంటికి తిరిగి చేరుకోకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో మరుసటి రోజు ఉదయం 10 గంటల సమయంలో బాలిక ఇంటి సమీపంలో కనిపించింది.

చిన్న వ్యాపారులకు ఊరట.. తగ్గిన వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధర.. 19 కేజీల ఎల్పీజీ సిలిండర్‌ ధరను రూ. 115.50 మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించిన చమురు సంస్థలు.. 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్‌ ధరలో మాత్రం ఎలాంటి మార్పూ లేదు

కుమార్తెను ఇంటికి తీసుకొచ్చిన తల్లిదండ్రులు నిన్నంతా ఏమైపోయావని ప్రశ్నించగా, బాలిక చెప్పింది విని హతాశులయ్యారు. తన స్నేహితులు ఇద్దరు బైక్‌పై హోటల్‌కు తీసుకెళ్లారని, అక్కడ మరో ముగ్గురితో కలిసి తనపై అఘాయిత్యానికి పాల్పడ్డారని బాలిక తెలిపింది. విషయం ఎక్కడా చెప్పొద్దని, చెబితే చంపేస్తామని హెచ్చరించారని చెప్పింది. దీంతో షాకైన తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వైద్య పరీక్షల కోసం బాలికను ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు అత్యాచారం జరిగినట్టు నిర్ధారించారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు ఇద్దరిని అరెస్ట్ చేశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.

(The above story first appeared on LatestLY on Nov 01, 2022 08:35 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).