Hyderabad, November 1: వాణిజ్య సిలిండర్ల (Commercial Cylinder) వినియోగదారులకు (Consumers) ఉపశమనం కలిగింది. 19 కేజీల ఎల్పీజీ (LPG) సిలిండర్ ధరను చమురు సంస్థలు తగ్గించాయి. రూ.115.50 మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1,744కి, ముంబయిలో రూ. 1,696కు చేరాయి. తగ్గించిన ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని చమురు సంస్థలు వెల్లడించాయి.
అయితే 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పూ లేదు. జూలై నుంచి 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ రేటు నిలకడగానే ఉంది. అయితే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర మాత్రం తగ్గుతూ వస్తోంది.
#LPG Price Cut | Price of commercial cylinder (19-kg) cut by ₹115 to ₹1,744 in #Delhi pic.twitter.com/XebsnCRkL1
— CNBC-TV18 (@CNBCTV18Live) November 1, 2022