Delhi Metro Viral Video: ఢిల్లీ మెట్రోలో పీకలదాకా తాగిన యువతి, ఫుల్లుగా కిక్కెక్కి తోటి ప్రయాణికురాలిపై బూతుల పంచాంగం, మరోసారి వార్తల్లోకి ఢిల్లీ మెట్రో
కిక్కు బాగా ఎక్కేసిందో ఏమో కానీ.. తన ఎదురు సీట్లో కూర్చున్న ప్రయాణికురాలితో గొడవ పెట్టేసుకుంది. అసలే మందేసింది.. ఇంకేముంది.. నోటి నుంచి బూతుల వర్షం (Vulgar Words In Delhi Metro) వచ్చేసింది. తోటి ప్రయాణికురాలిని బండ బూతులు తిట్టింది. ఆ పక్కనే ఉన్న యువకుడు సర్ది చెప్పాలని చూసినా.. అమ్మగారు అస్సలు వినలేదు. మద్యం మత్తులో మరింత రెచ్చిపోయింది
New Delhi, April 29: నాన్ సెన్స్ కి కేరాఫ్ గా మారింది ఢిల్లీ మెట్రో (Delhi metro). ఇటీవల ఢిల్లీ మెట్రోలో వరుసగా జరుగుతున్న సంఘటనలు స్థానికులు ఆందోళనకు గురి చేస్తున్నాయి. అసలు మెట్రో ఎక్కాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. ఎప్పుడు ఏ తాగుబోతు (Drunken) వచ్చి మీద పడతాడో తెలీదు. ఏ క్షణాన పోకిరీలు అల్లరి చేస్తారో తెలీదు. ఒక అమ్మాయేమో అండర్ వేర్, బ్రాతో మెట్రో ఎక్కుతుంది. మరో అమ్మాయి ఫుల్లుగా తాగేసి రచ్చ రచ్చ చేస్తుంది. ఇంకో అమ్మాయి ఏమో పిచ్చి పిచ్చి స్టెప్పులు వేస్తుంది. ఒకడేమో టవల్ తో మెట్రో (Delhi metro) ఎక్కుతాడు. ఇంకొకడేమో అసభ్యకరంగా ప్రవర్తిస్తాడు. మరొకడేమో ఏకంగా అందరి ముందే హస్త ప్రయోగమూ చేసుకుంటాడు. వామ్మో.. ఇలా.. ఎవడి పిచ్చి ఆడికి ఆనందం టైప్ లో రకరకాల మనుషులు ఢిల్లీ మెట్రోలో తారసడుతున్నారు. ఇటీవలి కాలంలో ఇలాంటి న్యూసెన్స్ ఢిల్లీ మెట్రోలో బాగా ఎక్కువైంది.
తాజాగా ఓ యువతి చేసిన పని తోటి ప్రయాణికులను బాగా ఇబ్బంది పెట్టింది. ఆ యువతి తీరుతో అంతా షాక్ అయ్యారు. ముక్కున వేలేసుకున్నారు. అసలు అమ్మాయేనా అనే డౌట్ కూడా వచ్చింది. ఇంతకీ ఆ యువతి ఏం చేసిందో తెలుసా.. పీకల దాకా మద్యం తాగి మెట్రో ఎక్కింది. మెట్రో ఎక్కిన అమ్మాయి పోనీ సైలెంట్ గా ఉందా? అదీ లేదు. మద్యం మత్తులో రచ్చ రంబోలా చేసింది. మద్యం సేవించి మెట్రో రైలు ఎక్కిన యువతి.. బూతులతో రెచ్చిపోయింది. ఓ యువతి, యువకుడు మెట్రో రైలు ఎక్కారు. ఆ అమ్మాయి బాగా తాగేసి ఉంది.
కిక్కు బాగా ఎక్కేసిందో ఏమో కానీ.. తన ఎదురు సీట్లో కూర్చున్న ప్రయాణికురాలితో గొడవ పెట్టేసుకుంది. అసలే మందేసింది.. ఇంకేముంది.. నోటి నుంచి బూతుల వర్షం (Vulgar Words In Delhi Metro) వచ్చేసింది. తోటి ప్రయాణికురాలిని బండ బూతులు తిట్టింది. ఆ పక్కనే ఉన్న యువకుడు సర్ది చెప్పాలని చూసినా.. అమ్మగారు అస్సలు వినలేదు. మద్యం మత్తులో మరింత రెచ్చిపోయింది. ఒకానొక సమయంలో తోటి యువతిపై దాడి చేసేందుకు కూడా వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Drunk girl abuse in #delhimetro #NewDelhi pic.twitter.com/7UZ95ezsE0
— Ad (@adkaushik77) April 28, 2023
మొత్తంగా ఢిల్లీ మెట్రో రైలు తరుచుగా న్యూస్ లోకి ఎక్కుతోంది. నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీ జరుగుతూనే ఉంది. దీంతో.. ఈ ఢిల్లీ మెట్రోకి ఏమైందబ్బా? అనే సందేహం అందరిలోనూ నెలకొంది. ఇంకా ఎన్నెన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందోనని ఢిల్లీ వాసులు వర్రీ అవుతున్నారు.
(The above story first appeared on LatestLY on Apr 29, 2023 11:19 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

