Folk dance: బాగా మందేసి.. బ్రీత్ అనలైజర్ టెస్టు నుంచి తప్పించుకునేందుకు డ్యాన్స్ చేసిన మహిళ..

తాను తాగి లేనని, కావాలంటే చూడాలని పోలీసులకు చెబుతూ.. డ్యాన్స్ చేయడం మొదలుపెట్టింది ఓ మహిళ.. ఎందుకు?

Folk dance: బాగా మందేసి.. బ్రీత్ అనలైజర్ టెస్టు నుంచి తప్పించుకునేందుకు డ్యాన్స్ చేసిన మహిళ..

NewYork, September 10: ఓ 38 ఏళ్ల మహిళ.. పబ్ కు వెళ్లి బాగా మద్యం తాగింది.. బయటికి వచ్చి కారు డ్రైవ్ చేయడం మొదలుపెట్టింది. మధ్యలో పోలీసులు ఆమెను ఆపారు. డ్రంకెన్ డ్రైవ్ టెస్టు చేయడం కోసం బ్రీత్ అనలైజర్ ను బయటికి తీశారు. దానిలోకి ఊదాలని ఆ యువతిని కోరారు. కానీ అందుకు ఆమె నిరాకరించింది.

బ్రిటన్ లో వింత.. క్వీన్ ఎలిజబెత్ రూపంలో ఆకాశంలో మేఘం.. బకింగ్ హామ్ ప్యాలెస్ మీదుగా ఆకాశంలో రెండు ఇంద్ర ధనుస్సులు.. వీటి మీదుగానే రాణి స్వర్గానికి వెళ్లారని పలువురి కామెంట్

ఇంతవరకు బాగానే ఉందిగానీ.. తాను తాగి లేనని, కావాలంటే చూడాలని పోలీసులకు చెబుతూ.. డ్యాన్స్ చేయడం మొదలుపెట్టింది. కానీ కాసేపటికి అలసి ఆగిపోయింది. పోలీసులు ఎంతగా నచ్చజెప్పినా వినలేదు. అయినా డ్యాన్స్ చేస్తూ.. తనను వదిలేయాలని చెబుతూనే ఉంది. ఇలా కొన్ని నిమిషాలు జరిగాక.. ఆమె ఆగిపోయింది.

తర్వాత పోలీసులు ఆమెను ఒక వైట్ లైన్ పై తూలిపడకుండా నడవాలని సూచించారు. అలా నాలుగు అడుగులు వేసిన ఆమె.. ఆ తర్వాత నడవలేకపోయింది. అనంతరం పోలీసులతో వాదనకు దిగింది. దీనితో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. తాగి వాహనం నడుపుతోందని కేసు నమోదు చేసి జైలుకు పంపారు. అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన ఈ ఘటనను పోలీసులు వీడియో తీశారు. దీనికి సంబంధించిన వీడియో ఇటీవల వైరల్ గా మారింది. లక్షన్నర మందికిపైగా దీనిని వీక్షించారు.

 

 

(The above story first appeared on LatestLY on Sep 10, 2022 10:11 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).