London, September 10: బ్రిటర్ రాణి క్వీన్ ఎలిజబెత్ 2 (Queen Elizabeth 2) మరణంతో యావత్ ప్రపంచం విషాదంలో మునిగిపోయింది. ఆమె మరణ వార్తను అధికారికంగా ప్రకటించిన తర్వాత లండన్ (London)లో ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. లిన్నే అనే మహిళ తన 11 ఏళ్ల కుమార్తెతో కలిసి కారులో వెళ్తుండగా... ఆకాశంలో బంగారు వర్ణంలో ఎలిజబెత్ రాణిని పోలిన మేఘం (Cloud) కనిపించింది. దీంతో... 'క్వీన్' అని గట్టిగా అరిచిన కుమార్తె తన తల్లికి ఆ దృశ్యాన్ని చూపించింది. ఎంతో ఆశ్చర్యపోయిన లిన్నే క్వీన్ మేఘాన్ని ఫొటో తీసి సోషల్ మీడియా (Social Media)లో షేర్ చేసింది. ఈ ఫొటో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది.
మరోవైపు, నిన్న రాణి అధికారిక నివాసం బకింగ్ హామ్ ప్యాలెస్ మీదుగా ఆకాశంలో రెండు ఇంద్ర ధనుస్సులు (Rainbows) కనిపించాయి. ఈ వింతను లండన్ ప్రజలు తమ కెమెరాల్లో బంధించారు. ఈ ఇంధ్రధనుస్సుల మీదుగా రాణి స్వర్గానికి వెళ్లారని పలువురు కామెంట్ చేస్తున్నారు.
Queen Elizabeth spotted in the clouds.
What a photo 🇬🇧❤️ pic.twitter.com/9AxJZlJknv
— airborne assault services (@Wayne57072607) September 8, 2022