Rainbow (Photo Credits: Twitter)

Beijing , August 29: కలలో (Dreams) కూడా ఊహించలేని అన్నో అద్భుత దృశ్యాలను ప్రకృతి (Nature) సహజసిద్ధంగా ఆవిష్కరిస్తుంది. ఇదీ అలాంటి ఘటనే. చైనాలోని (China) హైనన్‌ ప్రావిన్సులో ఉన్న హైకు నగరంలో ఇటీవల ఇంద్రధనుస్సు (Rainbow) రంగుల్లో మెరిసిన మబ్బులు స్థానికులను సంబ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది. ప్రకృతి చేసిన ఈ చిత్రవిచిత్రం నెటిజన్లను ఎంతగానో అబ్బురపరించింది.

ఇదేందయ్య.. ఇది..!! గర్ల్ ఫ్రెండ్ ఎగ్జామ్‌ ఫెయిల్‌ అయ్యిందని ఏకంగా స్కూల్‌ని తగలెట్టేశావా... వార్నీ!

ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా (Viral) మారింది. మబ్బుల్లోని నీటి బిందువులు, మంచు ముక్కల మధ్య సూర్యకాంతి వివర్తనం చెందినప్పుడు ఇంద్రధనుస్సు రంగుల్లో మేఘం కనిపిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.