Cricket Viral Video: ఇంగ్లాండ్ బౌలర్ చేసిన రన్ ఔట్ తప్పిదం వీడియో వైరల్, పంచ్ డైలాగ్స్ తో బౌలర్ ను ఆటాడేసుకున్న ట్రోలర్స్.

ఇంగ్లాండ్ బౌలర్ కేట్ క్రాస్ (Kate Cross) చేసిన ఓ రనౌట్ తప్పిదం భయంకరమైన కామెడీని క్రియేట్ చేసింది. ఈ సీస్ చూసిన వారందరూ 'అరె ఏంట్రా ఇదీ' అని షాక్ అయ్యారు. ఆ వీడియో ఆన్‌లైన్ లో పిచ్చిపిచ్చిగా వైరల్ అయిపోయింది...

క్రికెట్ ఒకే ఆటే కావొచ్చు కానీ అందులో డ్రామా, సెంటిమెంట్, ఉత్కంటత, కామెడీ ఇలా ఎన్నో రకాల ఎలిమెంట్స్ ఉంటాయి. మైదానంలో కొన్నిసార్లు ఆటగాళ్ల ప్రవర్తన ప్రేక్షకుల్లో ఎమోషన్స్ ని పెంచితే, మరి కొన్నిసార్లు జబర్దస్త్ కామెడీని పంచుతాయి. ఇలాంటి ఒక సంఘటన జూన్ 21, 2019న England Women vs WI Women క్రికెట్ మ్యాచ్ లో చోటు చేసుకుంది.

Northampton వేదికగా జరిగిన ఆ మ్యాచ్ లో ఇంగ్లాండ్ బౌలర్ కేట్ క్రాస్ (Kate Cross) చేసిన ఓ రనౌట్ తప్పిదం భయంకరమైన కామెడీని క్రియేట్ చేసింది. కేట్ క్రాస్ వేసిన ఓ బంతికి విండీస్ బ్యాట్స్‌విమెన్ సింగిల్ కోసం ప్రయత్నించారు. అయితే ఫీల్డర్ నేరుగా కేట్ క్రాస్ వైపు బంతిని విసిరింది. అప్పటికే నాన్ స్ట్రైకింగ్ వైపుకు పరుగెత్తుకుంటూ వస్తున్న విండీస్ బ్యాట్స్‌ఉమన్ క్రీజుకు చాలా దూరంలో ఉంది. బంతిని అందుకున్న కేట్ క్రాస్ తన వైపు వస్తున్న బ్యాట్స్‌ఉమన్ ను గమనించకుండా , కీపర్ వైపుకు బంతిని విసిరడంతో ఎంతో సులభమైన రనౌట్ చాన్స్ మిస్సయ్యంది. ఈ సీస్ చూసిన వారందరూ 'అరె ఏంట్రా ఇదీ' అని షాక్ అయ్యారు.

ఇప్పట్లో ఏ చిన్న కామెడీ కంటెంట్ దొరికినా ఆన్‌లైన్ లో వైరల్ అయిపోతుంది.  ఇంకేం ఈ వీడియో కూడా ఆన్‌లైన్ లో పిచ్చిపిచ్చిగా వైరల్ అయిపోయింది. కామెడీ పంచులు భారీగా పేలాయి. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ గెలిచినా సరే అది ఎవరూ పట్టించుకోలేరు, ఈ చిన్న కామెడీ సంఘటననే ఫుల్ పాపులర్ అయిపోయింది.

ఆన్‌లైన్ లో తనపై జరిగిన ట్రోలింగ్ దెబ్బకు బౌలర్ కేట్ క్రాస్ తర్వాత ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసింది.

తన వైపు వికెట్లలో ఒక బెయిల్ పడిపోయి ఉన్నట్లు గమనించానని అందుకే అవతలి వైపుకు బంతి విసరానని, తాను కూడా ఓ మనిషినే అని చెప్పుకొచ్చింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement