Wildlife photographer: మబ్బుల మధ్య చేపలా.. నీలి సముద్రంలో మీనాలా? ఎంత అద్భుతం
నీటిలో ఉండాల్సిన చేపలు నింగిలోని వెండి మబ్బుల మధ్య ఎగురుతున్నట్లు.. ఏదో స్వర్గంలో ఉన్నట్లు కనిపిస్తోంది కదూ.. ఈ చిత్రాన్ని ఫిన్లాండ్‌కు చెందిన టీనా టోర్మెనెన్ హోంకాలెంపీ సరస్సులో తీశారు.
Helsinki, September 4: కొన్ని చిత్రాలు మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఇదీ అలాంటిదే. నీటిలో ఉండాల్సిన చేపలు నింగిలోని వెండి మబ్బుల మధ్య ఎగురుతున్నట్లు.. ఏదో స్వర్గంలో ఉన్నట్లు కనిపిస్తోంది కదూ.. ఈ చిత్రాన్ని ఫిన్లాండ్‌కు చెందిన టీనా టోర్మెనెన్ హోంకాలెంపీ సరస్సులో తీశారు. ‘అండర్‌వాటర్ వండర్ల్యాండ్’లా టోర్మెనెన్ అభివర్ణిస్తున్న ఈ ఫొటో ప్రతిష్టాత్మక ‘వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్’ పోటీలో ఎన్నదగిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. వివిధ విభాగాల్లో విజేతలను అక్టోబర్ 11న ప్రకటిస్తారు. ఫోటోలో మేఘాల్లా కనిపిస్తున్నవి ఒకరకమైన నాచు అట. ఎంత బాగుందో కదూ..
(The above story first appeared on LatestLY on Sep 04, 2022 11:04 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

