World's Longest Locks Grows Hair to 110 Feet: కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మెయ్యాలు డ్యూడ్.. ఇది నిజంగానే 110 అడుగుల జుట్టు
ఆ హెయిర్‌ను ఒక్కసారి వాష్ చేయాలంటే ఆరు షాంపూ బాటిల్స్ అయిపోతాయి. ఇక ఆరడానికి పట్టే సమయం రెండు రోజులు!
ఫొటో (Photo) చూశారా? ఆమె ముందు పరిచి ఉన్న జుట్టు పొడవెంతో తెలుసా... 110 అడుగులు. నిజం. ప్రపంచంలో అత్యంత పొడవైన (Longest) డ్రెడ్‌లాక్స్ (చిక్కులు పడిన జుట్టు) కలిగిన మహిళగా గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది ఫ్లోరిడాకు చెందిన ఆశా మండేలా.
40 ఏళ్లుగా ఈ జుట్టు పెంచుతున్న ఆమె... 19 అడుగుల ఆరున్నర అంగుళాల పొడవు డ్రెడ్‌లాక్స్ ఉన్న మహిళగా 2009 నవంబర్ 11లోనే గిన్నిస్ రికార్డు (Guinness World Records) సాధించింది. 14 ఏళ్ల తరువాత 110 అడుగుల పొడవైన జుట్టుతో తన రికార్డును తానే బ్రేక్ చేసుకుంది. ఈ హెయిర్‌ను ఒక్కసారి వాష్ చేయాలంటే ఆరు షాంపూ బాటిల్స్ అయిపోతాయి. ఇక ఆరడానికి పట్టే సమయం రెండు రోజులు!
(The above story first appeared on LatestLY on Aug 23, 2022 12:54 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

