Ranjitha as Kailasa PM: నిత్యానంద దేశానికి ప్రధానిగా రంజిత? సొంతంగా కైలాస పేరుతో దేశాన్ని ఏర్పాటు చేసుకున్న నిత్యానంద
వివాదాస్పద ఆథ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి (Nityananda Swamy) దేశం నుంచి పారిపోయి సొంతంగా ఒక దేశాన్ని ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. దానికి కైలాస (Kailasa) (యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస) దేశంగా పేరు పెట్టుకున్నాడు.
Newdelhi, July 7: వివాదాస్పద ఆథ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి (Nityananda Swamy) దేశం నుంచి పారిపోయి సొంతంగా ఒక దేశాన్ని ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. దానికి కైలాస (Kailasa) (యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస) దేశంగా పేరు పెట్టుకున్నాడు. ఆ దేశానికి ప్రత్యేక కరెన్సీ (Currency), పాలన విభాగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు నిత్యానంద మరోసారి వార్తల్లో నిలిచాడు. తన ప్రియ శిష్యురాలు, సినీ నటి రంజితను (Ranjitha) కైలాస దేశానికి ప్రధానిగా ప్రకటించాడు. ఈ మేరకు ఒక ప్రముఖ తమిళ పత్రిక వెల్లడించింది. రంజిత పలు తెలుగు, తమిళం, కన్నడ చిత్రాలలో నటించిన సంగతి తెలిసిందే.
ఆ ప్రచారం కూడా..
కెరీర్ గొప్పగా ఉన్న సమయంలోనే రంజిత నిత్యానంద వద్దకు చేరింది. నిత్యానందకు, రంజితకు మధ్య శారీరక సంబంధాలు ఉన్నాయనే ప్రచారం కూడా గతంలో పెద్ద ఎత్తున జరిగింది.
(The above story first appeared on LatestLY on Jul 07, 2023 10:21 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

