Free Haleem Offer: వీడియో ఇదిగో, ఫ్రీ హలీం కోసం ఎగబడిన జనాలు, లాఠీలకు పనిచెప్పిన పోలీసులు, మలక్‌పేటలోని ఓ రెస్టారెంట్‌లో ఘటన
ముస్లిం సోదరులకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాస ఉపవాస దీక్షలు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మలక్‌పేటలోని ఓ రెస్టారెంట్‌లో ఉచిత హలీమ్(Halim) ఆఫర్ ను ప్రకటించింది. ఫ్రీ హలీం అంటే వందలాది మంది దూసుకు వచ్చారు. ఫలితంగా హోటల్ వద్ద జనం రద్దీతో గందరగోళం నెలకొంది. పరిస్థితి అదుపు తప్పడంతో హోటల్ యాజమాన్యం పోలీసులను ఆశ్రయించింది.
- Read in
- తెలుగు
ముస్లిం సోదరులకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాస ఉపవాస దీక్షలు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మలక్‌పేటలోని ఓ రెస్టారెంట్‌లో ఉచిత హలీమ్(Halim) ఆఫర్ ను ప్రకటించింది. ఫ్రీ హలీం అంటే వందలాది మంది దూసుకు వచ్చారు. ఫలితంగా హోటల్ వద్ద జనం రద్దీతో గందరగోళం నెలకొంది. పరిస్థితి అదుపు తప్పడంతో హోటల్ యాజమాన్యం పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు తమ లాఠీలకు పని చెప్పారు. ఈ సందర్భంగా మలక్ పేట పరిధిలోని ఆ హోటల్ వద్ద ట్రాఫిక్ జామ్ అయ్యింది.ఉచిత హాలీమ్ ఆఫర్ గురించి హోటల్ యాజమాన్యం పోలీసులకు ముందుగా సమాచారం ఇవ్వలేదు. వారు ఎలాంటి అనుమతి తీసుకోలేదు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించినందుకు కేసు నమోదు చేస్తామని సీఐ శ్రీనివాస్ తెలిపారు.
Here's Video
VIDEO | Police resorted to lathicharge to disperse the crowd that thronged a restaurant in Hyderabad's Malakpet allegedly to get free Haleem earlier today.
The restaurant management called the police after the crowd went out of control, leading to a massive traffic jam in the… pic.twitter.com/dBRnLO9sbd
— Press Trust of India (@PTI_News) March 12, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 13, 2024 11:46 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

