Bizarre Love Story: పెళ్లి కొడుకు తండ్రి, పెళ్లి కూతురు తల్లి జంప్, పెటాకులైన పెళ్లి, నివ్వెరపోయిన బంధుగణం, వైరల్ అవుతున్న సంఘటన

గుజరాత్ లోని సూరత్ నగరంలో ఒక కాలనీ, ఎదురెదురుగా ఇండ్లు, ఒక ఇంట్లో అమ్మాయి, మరో ఇంట్లో అబ్బాయి. ప్రతి రోజు ఇద్దరు ఒకరికొకరు ఎదురుపడేవారు. అతడి పట్ల ఆ అమ్మాయి ఎంతో ఇష్టం చూపించేది, ఆ ఇంటికి ఈ ఇంటికి వచ్చి పోవడాలు బాగానే జరిగేవి. కాలనీలో వీరిది ఒక బ్యూటీఫుల్ లవ్ స్టోరీ....

Bizarre Love Story: పెళ్లి కొడుకు తండ్రి, పెళ్లి కూతురు తల్లి జంప్, పెటాకులైన పెళ్లి, నివ్వెరపోయిన బంధుగణం, వైరల్ అవుతున్న సంఘటన
Representational Image (Photo Credits: File Image)

ప్రేమ గుడ్డిది అంటే, కష్టంగా అనిపించినా కొన్ని సార్లు నమ్మాల్సి వస్తుంది. కానీ మరి ఇంత గుడ్డిదని తెలిస్తే తట్టుకోవడం ఎవరి వల్ల కాదు.

వారి కథ వింటే ఒక మంచి లవ్ స్టోరీ, ఒక కడుపుబ్బా నవ్వించే కామెడీ స్టోరీ, రెండు కలగలిపిన రొమాంటిక్ కామెడీ డ్రామా తీసేయొచ్చు. వారి అందమైన ప్రేమకథను ఇటీవల నాగచైతన్య- సమంత కాంబినేషన్ లో వచ్చిన మజిలీ సినిమాతో 'కొద్దిసేపు' పోల్చుకుందాం.

వివరాల్లోకి వెళ్తే గుజరాత్ (Gujarat) లోని సూరత్ (Surat) నగరంలో ఒక కాలనీ, ఎదురెదురుగా ఇండ్లు, ఒక ఇంట్లో అమ్మాయి, మరో ఇంట్లో అబ్బాయి. ప్రతి రోజు ఇద్దరు ఒకరికొకరు ఎదురుపడేవారు. అతడి పట్ల ఆ అమ్మాయి ఎంతో ఇష్టం చూపించేది, ఆ ఇంటికి ఈ ఇంటికి వచ్చి పోవడాలు బాగానే జరిగేవి. కాలనీలో వీరిది ఒక బ్యూటీఫుల్ లవ్ స్టోరీ, అది ఆ కాలనీ వాసులకు, ఫ్రెండ్స్ అందరికీ తెలుసు. అలా రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి.

కట్ చేస్తే... 2020 ఫిబ్రవరి నెల, రెండో వారంలో పెళ్లి. ఎన్నో ఆశలతో, ఎన్నో ఊహలతో పెళ్లికొడుకు, పెళ్లి కూతురు పెళ్లికి సిద్ధమయ్యారు. పెళ్లి ఎలా చేసుకోవాలనేది ఒక ఏడాది నుంచే ప్లాన్ చేసుకుంటున్నారు. వారి ఇన్నాళ్ల స్నేహం, ప్రేమ, మరికొన్ని రోజుల్లో పెళ్లి బంధంతో ఏకమవుతుందని తెలిసి ఆ జంట ఎంతో సంతోషంతో సంబరంగా ఉన్నారు. కానీ, అంతలోనే షాకింగ్ న్యూస్. 48 ఏళ్లుండే పెళ్లికొడుకు తండ్రి జనవరి 10న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. పెళ్లి దగ్గర పడుతున్న వేళ ఇలా ఎలా జరిగింది? అని ఇరువర్గాల బంధువులంతా ఆందోళన చెందారు. ఇంతలో మరో షాక్ ఏంటంటే 46 ఏళ్లు ఉండే పెళ్లి కూతురు తల్లి కూడా అదే రోజు నుంచి కనిపించకుండా పోయింది. అసలు ఏం జరుగుతుందో తెలియని గందరగోళ పరిస్థితి. ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాయి.

తర్వాత నిజం తెలిసింది ఏంటి అంటే ఆ ఇద్దరు కలిసి లేచిపోయారు అని బంధువులకు సమాచారం అందింది. అసలు విషయం ఏంటంటే మనం ముందుగా చెప్పుకున్న 'మజిలీ' ప్రేమ కథ వీరిదే! సుమారు ఓ 20 ఏళ్ల క్రితం ఇరుపొరుగుగా ఉండే ఈ జంట ఒకరినొకరు ప్రేమించుకున్నారు గానీ, ఇద్దరికీ పెళ్లి వేరే వాళ్లతో జరిగింది. ఆనాడు యుక్త వయసులో ఉన్నప్పుడు ఈమె (పెళ్లి కూతురు తల్లి) ను ఓ వజ్రాల వ్యాపారికి ఇచ్చి పెద్దలు పెళ్లి చేశారు, ఇక హీరో (పెళ్లి కొడుకు తండ్రి) టెక్స్ట్ టైల్ వ్యాపారి, లోకల్ పొలిటీషన్ గా ఉన్నాడు.

విచిత్రం ఏమిటంటే ఇన్నేళ్ల తర్వాత వీరికి పుట్టిన సంతానం కూడా ఒకరికొకరు ప్రేమలో పడ్డారు. ఇద్దరిదీ ఒకే కమ్యూనిటీ కావడం, బాగా తెలిసిన వారు కావడంతో వీరి ప్రేమకు పెద్దగా అడ్డంకులేమి రాలేదు. ఆ క్రమంలోనే పెళ్లి నిశ్చయమైంది. కానీ, అదే సమయంలో అబ్బాయి తండ్రికి, అమ్మాయి తల్లికి వారి పాత జ్ఞాపకాలు గుర్తుకువచ్చి మళ్ళీ ప్రేమ చిగురించింది. ఈ క్రమంలోనే పెళ్లి ఇంకో నెల ఉందనగా, ఈ ఇద్దరూ జంప్ అయ్యి ట్విస్ట్ ఇచ్చారు.  ఇక ఈ విషయం, గతంలోని వీరి లవ్ ఎఫైర్ (Bizarre Love Story) విషయం తెలుసుకొని కుటుంబ సభ్యులు తలెత్తుకోలేకపోతున్నారు.  పెళ్లిలో గట్టిమేళం మోగాల్సిన సమయంలో వరుడి వీపు విమానం మోత మోగింది

ఇరు వర్గాల బంధువులు ఒకరి మొఖం ఒకరు చూసుకోలేకపోతున్నారు. పెళ్లి క్యాన్సల్ అయింది, ప్రస్తుతం వీరి ఫోటోలు, వీరి కథ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వారి వ్యక్తిగత విషయాలకు గౌరవం ఇస్తూ ఇక్కడ వారి ఫోటోలను, గానీ పేర్లను గానీ వెల్లడించడం లేదు.

(The above story first appeared on LatestLY on Jan 21, 2020 02:04 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).