Caught On Cam: పుల్లుగా తాగి కదులుతున్న కారులో పాడు పని, వేగంగా వెళుతున్న కారు పైకి ఎక్కి పుష్‌అప్స్‌ చేస్తూ హల్‌చల్‌, వీడియో వైరల్ కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు

కారులో నలుగురు వ్యక్తులు ఫుల్‌గా మద్యం సేవించి డ్యాన్స్‌లు, పుష్‌అప్స్‌ చేస్తూ హల్‌చల్‌ చేశారు. అయితే, కారు రన్నింగ్‌లో ఉండగా ఓ వ్యక్తి కారుపై పుష్‌ అప్స్‌ చేయడం స్టార్ట్‌ చేశాడు. ఈ సందర్భంగా కారులో ఉన్న అతడి ఫ్రెండ్స్‌ ఎంకరేజ్‌ చేశారు.

Caught On Cam: పుల్లుగా తాగి కదులుతున్న కారులో పాడు పని, వేగంగా వెళుతున్న కారు పైకి ఎక్కి పుష్‌అప్స్‌ చేస్తూ హల్‌చల్‌, వీడియో వైరల్ కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు
Gurgaon man does push-ups on top of moving car in viral video (Photo-Video Grab)

హర్యానాలో ఓ వ్యక్తి రన్నింగ్‌లో ఉన్న కారుపై పుష్‌అప్స్‌ చేశాడు. ఈ ఘటన గురుగ్రామ్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైరల్ వీడియో ప్రకారం.. హర్యానా నెంబర్‌ ప్లేట్‌తో(HR72F6692) ఉన్న ఆల్టో కారు రాత్రి హైవేపై వెళ్తోంది.

ఈ క్రమంలో కారులో నలుగురు వ్యక్తులు ఫుల్‌గా మద్యం సేవించి డ్యాన్స్‌లు, పుష్‌అప్స్‌ చేస్తూ హల్‌చల్‌ చేశారు. అయితే, కారు రన్నింగ్‌లో ఉండగా ఓ వ్యక్తి కారుపై పుష్‌ అప్స్‌ చేయడం స్టార్ట్‌ చేశాడు. ఈ సందర్భంగా కారులో ఉన్న అతడి ఫ్రెండ్స్‌ ఎంకరేజ్‌ చేశారు.

సైకిల్‌పై వెళుతున్న చిన్నారిపై కుక్క దాడి, వైరల్ వీడియో ఇదిగో..

దీంతో, సదరు వ్యక్తి మరింత రెచ్చిపోయాడు. అనంతరం, చేతిలో మద్యం బాటిల్‌ తాగుతూ కేకలు వేశారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Video

ఈ వీడియో గురుగ్రామ్‌ పోలీసుల దృష్టికి రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు రూ.6,500 జరిమానా విధించారు. కారును స్వాధీనం చేసుకుని వాహనం యజమాని లోకేష్‌ను అదుపులోకి తీసుకున్నట్టు ట్రాఫిక్ డీసీపీ వీరేందర్ విజ్ తెలిపారు.

(The above story first appeared on LatestLY on May 31, 2023 11:31 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).