Heartwarming Video: గుండెను హత్తుకునే వీడియో, క్యాన్సర్‌ సోకిన చిన్నారి కోసం బ్యాట్‌‌మెన్‌ అవతారం ఎత్తిన డాక్టర్, బాలుడిని హత్తుకుని మహమ్మారితో ధైర్యంగా పోరాడంటూ శక్తివంతమైన మాటలు

సోషల్ మీడియాలో ఓ అద్బుతమైన మెసేజ్ అందించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ డాక్టర్ క్యాన్సర్‌‌ వ్యాధితో చివరి రోజులు లెక్కబెడుతున్న ఓ చిన్నారి కోరికను తీర్చేందుకు ఆ బాలుడికి ఎంతో ఇష్టమైన బ్యాట్‌‌మెన్‌ (Batman) అవతారం ఎత్తారు. ఈ వీడియో నెటిజన్లను కన్నీళ్లు (Heartwarming Video) పెట్టిస్తోంది.

Heartwarming Video: గుండెను హత్తుకునే వీడియో, క్యాన్సర్‌ సోకిన చిన్నారి కోసం బ్యాట్‌‌మెన్‌ అవతారం ఎత్తిన డాక్టర్, బాలుడిని హత్తుకుని మహమ్మారితో ధైర్యంగా పోరాడంటూ శక్తివంతమైన మాటలు
Doctor dresses up to fulfill a dream for a young patient with cancer who wanted to meet Batman (Photo-Video Grab)

సోషల్ మీడియాలో ఓ అద్బుతమైన మెసేజ్ అందించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ డాక్టర్ క్యాన్సర్‌‌ వ్యాధితో చివరి రోజులు లెక్కబెడుతున్న ఓ చిన్నారి కోరికను తీర్చేందుకు ఆ బాలుడికి ఎంతో ఇష్టమైన బ్యాట్‌‌మెన్‌ (Batman) అవతారం ఎత్తారు. ఈ వీడియో నెటిజన్లను కన్నీళ్లు (Heartwarming Video) పెట్టిస్తోంది. అయితే ఈ వీడియో తొమ్మిది నెలల క్రితం తీసినప్పటికీ ఫీల్‌ గుడ్‌ అనే ట్విటర్‌ పేజీలో శనివారం షేర్ అయింది.దీంతో ఈ వీడియోని నెటిజన్లు షేర్ల మీద షేర్ చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

వీడియోలోని కంటెంట్ ప్రకారం... అమెరికాలోని నార్త్‌ డకోటాకు చెందిన అయిదేళ్ల చిన్నారి క్యాన్సర్‌తో (young patient with cancer) చావు బతుకుల మధ్య పోరాడుతోంది. ట్రీట్ చేస్తున్న డాక్టర్ క్యాన్సర్‌ బాధిత చిన్నారిని నీ అతి పెద్ద కోరిక ఏంటి అని అడిగినప్పుడు...ఆ చిన్నారి తన అభిమాన సూపర్‌ హీరో బ్యాట్‌మెన్‌ను‌ కలవాలన్న కోరిక వెల్లడించాడు.దీంతో కొంత సమయం తర్వాత ఆ డాక్టర్‌ బ్యాట్‌మెన్‌‌ దుస్తులు ధరించి (Doctor dresses up to fulfill a dream) ఆస్పత్రి కారిడార్‌లో చిన్నారికి ఎదురుగా వచ్చాడు.

Here's Heartwarming video

ఆ చిన్నారిని దగ్గరకు పిలిచి తనని హత్తుకొమ్మని అడిగాడు. ఆ బాలుడు హత్తుకోగానే... నిన్ను ఇబ్బంది పెడుతున్న మహమ్మారితో ధైర్యంగా పోరాడు అంటూ బాలుడి గుండెల్లో ధైర్యాన్ని నింపాడు. ఈ వీడియో షేర్‌ చేసిన గంట వ్యవధిలోనే వేలల్లో వ్యూస్‌ వందల్లో కామెంట్స్‌ వచ్చాయి. ‘నేను దీన్ని పదిసార్లు చూశాను.. చూసిన ప్రతిసారి భావోద్యేగానికి లోనయ్యాను’, ‘ఈ వైద్యుడిని అతడి కుటుంబాన్ని దేవుడు ఆశ్వీర్వాదించాలని, ఆ దేవుడు చిన్నారిని క్యాన్సర్‌ నుంచి స్వస్థపరచాలని వేడుకుంటున్న’అంటూ నెటిజన్‌లు స్పందిస్తున్నారు.

గేల్‌ని మురిపిస్తున్న బుడ్డోడు, బిల్డింగ్‌ స్టెప్స్ ‌పైనుంచే హిట్టింగ్‌ల మోత, సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఆకాశ్‌ చోప్రా షేరింగ్ వీడియో

మొత్తం ఈ వీడియో 44 సెకన్‌ల నిడివి ఉంది. అయిదేళ్ల చిన్నారి కోసం‌ బాట్‌మెన్‌‌ వేషం​ వేసి ఆనందపరిచిన డాక్టర్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ వీడియో ప్రతి ఒక్కరి హృదయాన్ని హత్తుకుంటోంది

(The above story first appeared on LatestLY on Nov 15, 2020 01:46 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).