మరో కొద్ది రోజుల్లో ఐపీఎల్ సీజన్ ఆరంభం కాబోతోంది. అభిమానులను సిక్సర్ల మోతతో ప్లేయర్లు ఉర్రూతలూగించనున్నారు. అయితే అంతకన్నా ముందే సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. క్రిస్ గేల్ ని మరిపించేలా ఓ బుడ్డోడు బ్యాట్ ని అవలీలగా ఎత్తేస్తున్నాడు. టీమిండియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా (Former India cricketer Aakash Chopra) తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఈ వీడియోని పోస్ట్ చేశారు.
ఈ పోస్ట్ చేసిన వీడియోలో ఒక బుడతడు బిల్డింగ్ స్టెప్స్‌పైనే బ్యాట్ పట్టుకుని బంతిని ఎడాపెడా (kid playing phenomenal cricket shots) బాదేస్తున్నాడు. కింద నుంచి ఎవరో బాల్స్ వేస్తుంటే మెట్ల మీద నుంచి భారీ హిట్టింగ్‌లతో విరుచుకుపడుతున్నాడు. కచ్చితమైన హిట్టింగ్ ఆడిన ఈ బుడతడిని చూసి నెటిజన్లు తెగమురిసిపోతున్నారు. ఇక ఈ వీడియో పోస్ట్ చేసిన ఆకాశ్ చోప్రా.. ‘ఈ పిల్లాడు ఎంత బాగా ఆడుతున్నాడు’ అనే కామెంట్ చేశాడు.
అచ్చం క్రిస్ గేల్‌ను (Junior Chris Gayle) మరిపిస్తున్నాడని కొందరు అభినందించగా, యువరాజ్ సింగ్ బ్యాటింగ్ శైలిని పోలి ఉన్నాడని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఆ చిన్నోడిలో బ్యాట్ స్వింగ్ అదిరిపోయిందంటూ నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
Here's The Video
View this post on Instagram
How good is this young kid!!! #talented #aakashvani #feelitreelit #feelkaro
కాగా గతంలో ఓ టీ20 మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో యువరాజ్ సింగ్ 360 డిగ్రీస్ తరహాలో ఆరు సిక్సర్లు కొట్టిన జ్ఞాపకాల్ని ఈ బుడతడు గుర్తుచేశాడని ఒక నెటిజన్ పేర్కొన్నాడు. అయితే ప్రస్తుతం వైరల్‌గా మారిన ఆ బుడతడుకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.