Modi’s Mother Passes Away: ప్రధానమంత్రి మోదీ మాతృమూర్తి హీరాబెన్ కన్నుమూత.. వందేళ్ల అద్భుతం భగవంతుని పాదాల వద్ద విశ్రాంతి తీసుకుంటోందని ప్రధాని ట్వీట్.. వీడియోతో

ప్రధానమంత్రి నరేంద్రమోదీ తల్లి హీరాబెన్ మోదీ (100) కన్నుమూశారు. రెండు రోజుల క్రితం ఆమె అస్వస్థతకు గురికావడంతో అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు.

Modi’s Mother Passes Away: ప్రధానమంత్రి మోదీ మాతృమూర్తి హీరాబెన్ కన్నుమూత.. వందేళ్ల అద్భుతం భగవంతుని పాదాల వద్ద విశ్రాంతి తీసుకుంటోందని ప్రధాని ట్వీట్.. వీడియోతో
Credits: Twitter

Newdelhi, Dec 30: ప్రధానమంత్రి (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) తల్లి హీరాబెన్ మోదీ (Heeraben Modi) (100) కన్నుమూశారు. రెండు రోజుల క్రితం ఆమె అస్వస్థతకు గురికావడంతో అహ్మదాబాద్‌లోని (Ahmedabad) యూఎన్ మెహతా ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. తల్లి మరణవార్తను మోదీ ట్విట్టర్ (Twitter) ద్వారా వెల్లడించారు.

తెలంగాణలో 783 పోస్టులకు గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల, పోస్టుల వివరాలు, అప్లై తేదీలు, అర్హతలకు సంబంధించిప పూర్తి వివరాలు ఇవే..

‘వందేళ్ల అద్భుతం భగవంతుని పాదాల వద్ద విశ్రాంతి తీసుకుంటోందని’ పేర్కొన్నారు. ఆమె నిస్వార్థ కర్మయోగి అని, ఆమె జీవితం విలువలతో కూడుకున్నదని పేర్కొన్నారు. వందో పుట్టిన రోజు నాడు తాను తన తల్లిని కలిశానని గుర్తు చేసుకున్నారు. ఆమె ఎప్పుడూ తనతో ఓ విషయాన్ని చెప్పేవారని, విజ్ఞతతో పనిచేయాలని, జీవితాన్ని స్వచ్చంగా గడపాలని చెప్పేవారని గుర్తుచేసుకొన్నారు.

సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షల టైమ్ టేబుల్ విడుదల, ఫిబ్రవరి 15 నుంచి CBSE 10వ తరగతి పరీక్షలు

(The above story first appeared on LatestLY on Dec 30, 2022 08:17 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).