T20 World Cup 2022: ప్రపంచ కప్ ముంగిట.. టీమిండియాకు గుడ్ న్యూస్.. స్టార్ బౌలర్ బుమ్రా వచ్చేస్తున్నాడు!
గాయం కారణంగా ఆసియా కప్-2022కు దూరమైన భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుతం కోలుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జస్ప్రీత్ స్వదేశంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో జరగనున్న సిరీస్‌లతో పాటు టీ20 ప్రపంచ కప్ కు కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
NewDelhi, August 30: ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్-2022కు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్. గాయం కారణంగా ఆసియా కప్-2022కు దూరమైన భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుతం కోలుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జస్ప్రీత్ స్వదేశంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో జరగనున్న సిరీస్‌లతో పాటు టీ20 ప్రపంచ కప్ కు కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
వెన్ను నొప్పితో బాధపడుతున్న బుమ్రా బీసీసీఐ వైద్యుల పర్యవేక్షణలో బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో వారం రోజులు పాటు గడిపాడు. అతడు తన గాయం నుంచి కోలుకోవడంతో తిరిగి స్వస్థలం ముంబైకు చేరుకున్నట్లు సమాచారం.
(The above story first appeared on LatestLY on Aug 30, 2022 12:17 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

