Jobs in Kailasa: నిత్యానంద ‘కైలాసం’లో ఉద్యోగాలు.. ఏడాదిపాటు వేతనంతో కూడిన శిక్షణ.. సోషల్ మీడియాలో కనిపిస్తున్న ప్రకటన

వివాదాస్పద ఆధ్యాత్మికవేత్త నిత్యానంద ‘కైలాస దేశం’లో ఉద్యోగాలు ఉన్నాయని, దరఖాస్తు చేసుకోవచ్చంటూ ఆయన ప్రతినిధులు ప్రచారం చేసుకుంటున్నారు.

Jobs in Kailasa: నిత్యానంద ‘కైలాసం’లో ఉద్యోగాలు.. ఏడాదిపాటు వేతనంతో కూడిన శిక్షణ.. సోషల్ మీడియాలో కనిపిస్తున్న ప్రకటన
Nithyananda (File: Google)

Newdelhi, Nov 15: వివాదాస్పద ఆధ్యాత్మికవేత్త నిత్యానంద (Nityananda) ‘కైలాస దేశం’ (Kailasa)లో ఉద్యోగాలు (Jobs) ఉన్నాయని, దరఖాస్తు (Apply) చేసుకోవచ్చంటూ ఆయన ప్రతినిధులు (Representatives) ప్రచారం చేసుకుంటున్నారు. భారత్‌లోని తమ శాఖల్లో ఏడాదిపాటు వేతనంతో (Salary) కూడిన శిక్షణ (Training) పూర్తి చేసుకుని అర్హత సాధించిన వారికి కైలాస దేశంలో పనిచేసేందుకు అవకాశం ఇస్తామని చెబుతున్నారు. నిత్యానంద హిందూ విశ్వవిద్యాలయం, విదేశాల్లోని దేవాలయాలు, భారతదేశంలోని కైలాస ఆలయాలు, కైలాస ఐటీ విభాగం, కైలాస రాయబార కార్యాలయం, విద్యుత్ శాఖ, గ్రంథాలయం తదితరాల్లో ఖాళీలు ఉన్నాయని చెబుతున్నారు. వాటిలో ఉచితంగా శిక్షణ పొందుతూనే వేతనం కూడా తీసుకోవచ్చని సోషల్ మీడియాలో ప్రకటనలు కనిపిస్తున్నాయి.

బీహార్‌లో వింత శిశువు జననం.. ముక్కులేకుండా జన్మించిన శిశువు.. గ్రహాంతరవాసిగా ప్రచారం..

కాగా, నిత్యానంద ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. శ్రీలంకలో చికిత్స చేయించుకునేందుకు అవకాశం ఇవ్వాలని ఆయన భక్తులు అక్కడి ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలో ఉద్యోగాల ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.

(The above story first appeared on LatestLY on Nov 15, 2022 09:44 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).