Alien Child in Bihar: బీహార్‌లో వింత శిశువు జననం.. ముక్కులేకుండా జన్మించిన శిశువు.. గ్రహాంతరవాసిగా ప్రచారం..
Representational Image (Credits: Istock)

Patna, Nov 15: బీహార్‌లో (Bihar) జన్మించిన ఓ వింత శిశువును గ్రహాంతరవాసిగా (Alien) ప్రచారం చేస్తున్నారు. శిశువు ముక్కు స్థానంలో రెండు కళ్లు (Eyes) ఉండడమే ఈ ప్రచారానికి కారణం. అయితే, కొందరు మాత్రం వినాయకుడు (Lord Ganesha) పుట్టాడని చెబుతున్నారు. రాష్ట్రంలోని అలీషేర్‌పూర్‌కు చెందిన సరోజ పటేల్ భార్య రూపాదేవి ఇటీవల ఓ బిడ్డకు జన్మనిచ్చింది.

తొలి తెలుగు కౌబాయ్ కు టాలీవుడ్ అశ్రు నివాళి.. ప్రముఖ సినీనటుడు సూపర్ స్టార్ కృష్ణ మరణంపై ప్రముఖుల స్పందన ఇది..

అయితే, జన్యుపరమైన లోపాల కారణంగా శిశువు ముక్కు ఉండాల్సిన స్థానంలో కళ్లు ఉండి చూడడానికి గ్రహాంతరవాసిలా ఉండడంతో అదే ప్రచారం జరుగుతోంది. శ్వాస తీసుకునేందుకు రంధ్రం లేకపోవడంతో వైద్యులు నోటి ద్వారా ఆక్సిజన్ అందిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా పైపులు ఏర్పాటు చేశారు. వింత శిశువు జననం గురించి తెలిసిన జనం పలు రకాలుగా ప్రచారం చేస్తున్నారు. అయితే, క్రోమోజోమ్‌ల లోపాలతో శిశువులు ఇలా జన్మిస్తారని గైనకాలజిస్టులు చెబుతున్నారు.