Krishna No More: తొలి తెలుగు కౌబాయ్ కు టాలీవుడ్ అశ్రు నివాళి.. ప్రముఖ సినీనటుడు సూపర్ స్టార్ కృష్ణ మరణంపై ప్రముఖుల స్పందన ఇది..
Krishna (Credits: Google)

Hyderabad, Nov 15: ప్రముఖ సినీనటుడు సూపర్ స్టార్ కృష్ణ (Super Start Krishna) కన్నుమూశారు. కార్డియాక్ అరెస్ట్‌ తో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న ఆయన ఈ తెల్లవారుజామున మృతి చెందారు. దీంతో కృష్ణ కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. విషయం తెలిసిన అభిమానులు (Fans), తెలుగు చిత్ర పరిశ్రమ (Tollywood) తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. కృష్ణ మరణవార్త తెలిసిన సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆయన ఆత్మకు (Soul) శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలుపుతున్నారు. సొంత నిర్మాణ సంస్థను స్థాపించి సినిమా రంగంలో నూతన ఒరవడులను ప్రవేశపెట్టిన ఘనత కృష్ణదేనని సీఎం కేసీఅర్ కొనియాడారు. కృష్ణ కుటుంబసభ్యులకు ప్రగడ సానుభూతి తెలిపారు. కృష్ణ ఆంధ్రా జేమ్స్ బాండ్ గా కీర్తి గడించారని ఏపీ సీఎం జగన్ అన్నారు. నిజజీవితంలోనూ కృష్ణ మనసున్న మనిషి అని, ఆయన మరణం తెలుగు సినీరంగానికి, తెలుగు వారికి తీరని లోటు అని పేర్కొన్నారు.

ఇండియన్ జేమ్స్ బాండ్ ఇకలేరు.. సూపర్ స్టార్ కృష్ణ అస్తమయం.. కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి.. విషాదంలో అభిమానులు

కృష్ణ మృతిపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, టీడీపీ అధినేత చంద్రబాబు, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి, సినీ ప్రముఖులు చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, నిర్మాత ఎమ్మెస్ రాజు, హీరో నిఖిల్ తదితరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.