Karnataka: భార్య పక్కనున్నా.. పగలు రాత్రి పోర్న్ వీడియోలకు బానిసైన భర్త, అలా వద్దన్నందుకు భార్యపై వేధింపులతో పాటు చిత్రహింసలు, తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత భార్య
బెంగుళూరులో ఓ భర్త పోర్న్ సైట్స్‌ను చూడటం వ్యసనంగా మారడంతో అది వద్దన్న భార్యను వేధింపులకు గురి చేసి చిత్ర హింసలు పెట్టాడు. వేధింపులకు గురైన భార్య తన భర్త ఆగడాలను భరించలేక చివరకు కోర్టు మెట్లు (Bengaluru Woman approaches court) ఎక్కాల్సి వచ్చింది.
Bengaluru Nov 3: బెంగుళూరులో ఓ భర్త పోర్న్ సైట్స్‌ను చూడటం వ్యసనంగా మారడంతో అది వద్దన్న భార్యను వేధింపులకు గురి చేసి చిత్ర హింసలు పెట్టాడు. వేధింపులకు గురైన భార్య తన భర్త ఆగడాలను భరించలేక చివరకు కోర్టు మెట్లు (Bengaluru Woman approaches court) ఎక్కాల్సి వచ్చింది. బెంగుళూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జయనగర్‌లో ఉంటున్న ఓ మహిళకు నవంబర్ 2019లో వివాహమైంది. అయితే గత కొంత కాలం నుంచి తన భర్త పోర్న్ సైట్‌లను చూడటం ప్రారంభించాడు. ఆ అలవాటు కాస్త వ్యసనంగా (husband’s porn addiction) మారింది.
దీంతో పాటు రాత్రిపూట కాల్ గర్ల్స్‌తో ఆన్‌లైన్‌లో చాటింగ్ చేయడంతో పాటు వారి కోసం డబ్బులు కూడా ఖర్చు పెట్టేవాడు. అయితే ఇటీవల తన భర్త మ్యాట్రిమోనియల్ సైట్‌లో తన పేరు మీద అకౌంట్ ఓపెన్ చేయడంతో అందులో తను విడాకులు తీసుకున్నట్లు పేర్కొన్నాడు. దీంతో భరించలేని ఆమె తన భర్త అలవాట్ల గురించి అతని తల్లిదండ్రులకు కూడా ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరికి తన ప్రవర్తన మార్చుకోవాలని భర్తను వారించినందుకు ఆమెను వేధించడం ప్రారంభించాడు.
పాడైన ఆహారం పెట్టేవాడు. అంతేగాక ఆమెను ఇంటికే పరిమితం చేసి హింసించాడు.ఈ వేధింపులు తట్టుకోలేక తనకు న్యాయం చేయాలని కోర్టుని ఆశ్రయియింది. దీంతో కోర్టు మహిళ భర్తపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.
(The above story first appeared on LatestLY on Nov 03, 2021 03:32 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

