Porn on Smartphone: స్మార్ట్‌ఫోన్‌లో సెక్స్ వీడియోలు చూస్తున్నారా..ఈ విషయాలను గమనించకుంటే డేంజర్‌లో పడినట్లే, పోర్న్ వీడియోలు చూసే ముందు తప్పక తెలుసుకోవాల్సిన అంశాలపై ఓ లుక్కేసుకోండి
Representational Image | (Photo Credits: File Image)

జియో వచ్చిన తరువాత డేటా అనేది చాలా చీప్ అయిపోయింది. అత్యంత తక్కువ ధరకే డేటా వస్తూ ఉండటంతో ప్రతి ఒక్కరూ తమకు నచ్చినవి గంటల తరబడి చూస్తున్నారు. ఇక కరోనావైరస్ రావడం దేశమంతా లాక్ డౌన్ విధించడంతో గతేడాది కూడా డేటా వినియోగం భారీగా పెరిగిపోయింది. అయితే ఇంట్లో కూర్చుని అందరూ ఏం చూస్తున్నారని శోధిస్తే కళ్లు బైర్లు కమ్మే విషయాలు బయటకు వచ్చాయి. దేశంలో చాలామంది లాక్ డౌన్ సమయంలో పోర్న్ వీడియోలు చూస్తూ గడిపేస్తున్నారట..

స్మార్ట్‌ఫోన్‌లలో (Android smartphones) పోర్న్ సైట్‌లను వీక్షించే వారి సంఖ్య (Porn on Smartphone) రోజురోజుకు పెరుగుతోన్నట్లు పలు సర్వేలు తెలిపాయి. అయితే మొబైల్ ఫోన్‌లలో పోర్న్ కంటెంట్‌ను (watching pornography) వీక్షంచటం భారత్‌లో చట్టవిరుద్ధం కానప్పటకి టెక్నికల్ పరంగా కొన్ని అంశాల రూపంలో పెద్ద ముప్పే పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు.

మొబైల్ ఫోన్‌లలో పోర్న్ కంటెంట్‌ను వీక్షించే ముందు గుర్తుపెట్టుకోవల్సిన ముఖ్యమైన విషయాలను వారు చెబుతున్నారు. స్మార్ట్‌ఫోన్‌లో సెక్స్ వీడియోలు చూసేవారు గుర్తించుకోవాల్సిన విషయాలు (Reasons Why You Should not Watching Porn) ఓ సారి చూద్దాం.

1. రాన్సమ్‌వేర్

స్మార్ట్‌ఫోన్‌లలో తరచూ మీరు పోర్న్ సైట్‌లను వీక్షిస్తున్నట్లయితే ఖచ్చితంగా మీ ఫోన్‌కు రాన్సమ్‌వేర్ ముప్పు పొంచి ఉన్నట్లేనని నిపుణులు చెబుతున్నారు. యూజర్ ఓ పోర్న్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసిన వెంటనే ఓ పాపప్ లాంటిది ఓపెన్ అయి వెంటనే స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూటర్‌ను అది పూర్తిగా లాక్ చేసేస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.

కరోనా సోకిన మహిళను కూడా వదలని కామాంధుడు, తాకరాని చోట తాకుతూ అత్యాచారయత్నానికి ప్రయత్నించిన వార్డు బాయ్, భయంతో అలారం మోగించిన 59 ఏళ్ల మహిళ, నిందితుడిపై సెక్షన్ 376, 354 కింద కేసు నమోదు చేసిన పోలీసులు

2. బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడే అవకాశం

ఆ లాక్‌ను ఓపెన్ చేయాలంటే కొత్త మొత్తంలో డబ్బను చెల్లించాలంటూ హ్యాకర్లు బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ డబ్బు చెల్లించినప్పటికి మీ ఫోన్ యాదాస్థితికి వస్తుందో లేదో కూడా తెలియని పరిస్థతి. కాబట్టి, స్మార్ట్‌ఫోన్‌‌లలో పోర్న్ కంటెంట్ వీక్షించే ముందు ఈ విషయాన్ని గుర్తంచుకోండి.

3. చైల్డ్ పోర్నోగ్రఫీ..

చైల్డ్ పోర్నోగ్రఫీని వీక్షించటం చట్టవిరుద్ధం. మొబైల్ ఫోన్ లలో చైల్డ్ పోర్నోగ్రఫీని వీక్షించినట్లు రుజువులు దొరికేతే తప్పనిసరిగా అటువంటి వ్యక్తులు కఠినమైన లీగల్ సమస్యలను ఫేస్ చేయవల్సి ఉంటుంది.

4. వ్యక్తిగత డేటా గల్లంతు..

పోర్న్ వెబ్‌‌సైట్‌లలో వైరస్‌ను జొప్పించే లింక్స్ తప్పనిసరిగా ఉంటాయి. అటువంటి లింక్స్ పై క్లిక్ చేయటం ద్వారా యూజర్కు తెలియకుండానే వైరస్ అతని డివైస్‌లోకి ప్రవేశించి వ్యక్తిగత సమాచారంతో పాటు బ్యాంక్ అకౌంట్లలోని డబ్బును కూడా దొంగిలించే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

5. అవగాహన రాహిత్యం

చాలా మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు అవగాహన రాహిత్యంతో పోర్స్ యాప్స్‌ను తమ ఫోన్‌లలో ఇన్‌స్టాల్ చేసుకుంటుంటారు. ఈ చర్యతో వాళ్ల స్మార్ట్‌ఫోన్ చిక్కుల్లో పడినట్లేనని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రమాదకర సాఫ్ట్‌వేర్ వైరస్‌లు వీరి ఫోన్‌లలోకి ప్రవేశించి లోపలి డేటాను చిన్నాభిన్నం చేసేస్తాయట. అడల్ట్ కంటెంట్‌ను ఆఫర్ చేస్తోన్న వెబ్‌సైట్ ప్రొవైడర్స్ తన సైట్‌లను సందర్శించే మొబైల్ ఫోన్ యూజర్లకు చాట్, ఎస్ఎంఎస్, ప్రీమీయమ్ ఎస్ఎంఎస్, వాప్, లోకేషన్ వంటి సర్వీసులను ఎరవేస్తున్నారు. ఇవి చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. ఇవి ఒక్కోసారి యూజర్‌కు తెలియకుండానే బ్యాక్‌గ్రౌండ్‌లో యాక్టివేట్ కాబడతాయని, దింతో యూజర్ ఫోన్ కంట్రోల్ మొత్తం హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లినట్లేనని సైబర్ నిపుణులు చెబుతన్నారు.