Gwalior, April 19: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో దారుణ ఘటన (Madhya Pradesh Shocker) చోటు చేసుకుంది. కామంతో కళ్లు మూసుకుపోయిన వార్డు బాయ్ కోవిడ్ వైరస్ బారిన పడిన మహిళపై అత్యాచార యత్నం (Ward Boy Attempts to Rape 50-Year-Old COVID-19 Patient) చేశాడు. ఈ దారుణ ఘటన వివరాల్లోకి వెళితే.. ఎంపీలోని గ్వాలియర్‌లోని లోటస్ హాస్పిటల్‌లో కరోనావైరస్ సోకిన 59 ఏళ్ల మహిళ చికిత్స పొందుతోంది. కాగా ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆమెకు వెంటిలేటర్ సాయంతో వైద్యులు చికిత్సనందిస్తున్నారు.
అలాంటి పరిస్థితుల్లో ఉన్న మహిళపై అదే వార్డులో పనిచేసే వివేక్ లోధి(25) అనే వార్డు బాయ్ అత్యాచారానికి యత్నించాడు. ఆమెను తాకరాని చోట తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ మహిళ వెంటనే భయంతో అలారం మోగించడంతో అక్కడి నుంచి వివేక్ పారిపోయాడు. సదరు మహిళ కుటుంబసభ్యుల ఫిర్యాదుతో నిందితుడిపై సెక్షన్ 376, 354 కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
అయితే.. ఈ ఘటన కారణంగా ఆమెకు హాస్పిటల్ ఉద్దేశపూర్వకంగా ట్రీట్‌మెంట్ నిలిపివేసిందని, హాస్పిటల్ యజమానిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
బాధితురాలి కుమారుడు మాట్లాడుతూ.. లోధిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హాస్పిటల్ పరువు పోయిందని భావించిన యాజమాన్యం తమను ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.