stop rape Rape accused| Representational Image (Photo Credits: File Image)

Umaria, January 17: మధ్యప్రదేశ్‌లోని ఉమారియా జిల్లాలో (Umaria District) దారుణ ఘటన వెలుగుచూసింది.13 ఏళ్ల బాలికపై (13-Year-Old Girl Abducted) తొమ్మిది మంది లైంగిక దాడికి పాల్పడ్డారు. ఐదు రోజుల వ్యవధిలో కామాంధులు రెండుసార్లు కిడ్నాప్‌ చేసి అఘాయిత్యానికి పాల్పడ్డారు. సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ నేతృత్వంలోని ప్రభుత్వం ‘సమ్మాన్‌’ ప్రచారం నిర్వహిస్తున్న తరుణంలో ఈ ఘటన జరగడం అక్కడ కలకలం రేపుతోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో గత ఆరు రోజుల్లో ఇలాంటి నాలుగు సంఘటనలు జరిగాయి. దాంతో రాష్ట్రంలో మహిళల భద్రత గురించి ప్రశ్నలు వస్తున్నాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 13 ఏళ్ల బాలికను ఈ నెల 4న ఆమెకు తెలిసిన ఓ యువకుడు కిడ్నాప్‌ చేశాడు. అనంతరం అతనితో పాటు ఆరుగురు స్నేహితులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ నెల 5న బాలికను వదిలిపెట్టి.. విషయాన్ని బయటకు చెబితే చంపేస్తామని నిందితుడు బెదిరించడంతో బాలిక ఎవరికీ చెప్పలేదు. ఆరు రోజుల తర్వాత 11న మళ్లీ సదరు బాలికను మొదట లైంగిక దాడికి పాల్పడిన ఏడుగురిలో ఒకడు మళ్లీ కిడ్నాప్‌ చేశాడు. గ్రామానికి దగ్గర్లోని అడవిలోకి తీసుకెళ్లి అక్కడ ముగ్గురు మళ్లీ ఆమెపై అత్యాచారం చేశారు. ఆ కామాంధులు శుక్రవారం తెల్లవారుజామున అమ్మాయిని విడిచిపెట్టారు.

పదమూడేళ్ల బాలుడిపై నలుగురు హిజ్రాలు లైంగిక దాడి, మాదకద్రవ్యాలకు బానిసను చేస్తూ..హార్మోన్‌ ఇంజెక్షన్లు ఇచ్చి అవయువ మార్పిడి, నిందితులు అరెస్ట్

అక్కడి నుంచి బాలిక ఇంటికి వెళ్తుండగా.. ఇద్దరు ట్రక్ డ్రైవర్లు ఆమెను బలవంతంగా ట్రక్‌లోకి ఎక్కించి అత్యాచారం చేశారు. బాలిక తల్లిదండ్రుల సాయంతో శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఇప్పటివరకు ఆరుగురు నిందితులను అరెస్టు చేశాం. మిగిలిన వారిని కూడా త్వరలోనే పట్టుకుంటాం. నిందితులపై పోస్కో మరియు ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదైంది’ అని పోలీసు అధికారి అరవింద్ తివారీ తెలిపారు.