MP Shocker: మద్యం తాగించి రెండు రోజులు పాటు యువతిపై గ్యాంగ్ రేప్, నిందితుల్లో ఒకరు బీజేపీ నేత, పార్టీ నుంచి సస్పెండ్ చేసిన బీజేపీ, మిగతా ముగ్గురు కోసం గాలింపుల చర్యలు చేపట్టిన పోలీసులు

మధ్యప్రదేశ్ లోని సహదోల్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నలుగురు కామాంధులు ( (Four including BJP leader) ) ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ యువతికి మద్యం తాగించి రెండురోజుల పాటు ఆమెపై అత్యాచారం సాగించారు.

MP Shocker: మద్యం తాగించి రెండు రోజులు పాటు యువతిపై గ్యాంగ్ రేప్, నిందితుల్లో ఒకరు బీజేపీ నేత, పార్టీ నుంచి సస్పెండ్ చేసిన బీజేపీ, మిగతా ముగ్గురు కోసం గాలింపుల చర్యలు చేపట్టిన పోలీసులు
stop rape Rape accused| Representational Image (Photo Credits: File Image)

Bhopal, Feb 23: మధ్యప్రదేశ్ లోని సహదోల్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నలుగురు కామాంధులు ( (Four including BJP leader) ) ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ యువతికి మద్యం తాగించి రెండురోజుల పాటు ఆమెపై అత్యాచారం సాగించారు. నిందితుల్లో లోకల్ బీజేపీ నేత కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. దారుణ ఘటన వివరాల్లోకెళితే.. సహదోల్ జిల్లాలో ఓ యువతిని నలుగురు యువకులు కారులో అపహరించి తీసుకుని వెళ్లారు.

అనంతరం దగ్గర్లో . జైత్‌పూర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని గటఘాట్ ప్రాంతంలోని వ్యవసాయ క్షేత్రానికి తీసుకువెళ్లారు. అక్కడ ఆ యువతికి బలవంతంగా మద్యం తాగించి (force woman to drink liquor) ఒకరి తర్వాత ఒకరు ఆమెపై పశువుల్లా కామవాంఛను తీర్చుకున్నారు. ఈ దారుణం దాదాపు రెండు రోజుల పాటు సాగింది. ఆ తర్వాత ఆ యువతిని ఆమె ఇంటి ముందు వదిలేసి పరారయ్యారు. ఈ నెల 18, 19 తేదీల్లో యువతిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారం (gang-rape in farmhouse) చేయగా. ఈ నెల 20న ఆమె ఇంటి దగ్గర వదిలి వెళ్లిపోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

పెళ్లికి ప్రియుడు అడ్డు, పార్టీకి పిలిచి మద్యం తాగించి అతన్ని చంపేసింది, ఘజియాబాద్‌లో కాబోయే భర్తతో కలిసి ప్రియురాలి దారుణం, అదుపులోకి తీసుకున్న పోలీసులు

బాధితురాలు ఆదివారం నలుగురు కామాంధులపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆమెను చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. నలుగురు నిందితుల్లో ఒకడు స్థానిక బీజేపీ నాయకుడు విజయ్‌ త్రిపాఠీ అని తెలిసింది. అతన్ని పార్టీ నుంచి బహిష్కరించారు. మిగతా నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు అదనపు ఎస్పీ ముఖేష్ వైశ్ తెలిపారు.

(The above story first appeared on LatestLY on Feb 23, 2021 11:16 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).