Ghaziabad Shocker: పెళ్లికి ప్రియుడు అడ్డు, పార్టీకి పిలిచి మద్యం తాగించి అతన్ని చంపేసింది, ఘజియాబాద్‌లో కాబోయే భర్తతో కలిసి ప్రియురాలి దారుణం, అదుపులోకి తీసుకున్న పోలీసులు

యూపీలోని ఘజియాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. పార్టీ చేసుకుందామని మాజీ బాయ్‌ఫ్రెండ్‌ను పిలిపించిన కాబోయే భర్తతో కలిసి అతడిని ఓ యువతి హత్య (Ghaziabad Shocker) చేసింది.

Ghaziabad Shocker: పెళ్లికి ప్రియుడు అడ్డు, పార్టీకి పిలిచి మద్యం తాగించి అతన్ని చంపేసింది, ఘజియాబాద్‌లో కాబోయే భర్తతో కలిసి ప్రియురాలి దారుణం, అదుపులోకి తీసుకున్న పోలీసులు
Image used for representational purpose only. | File Photo

Ghaziabad, Feb 14: యూపీలోని ఘజియాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. పార్టీ చేసుకుందామని మాజీ బాయ్‌ఫ్రెండ్‌ను పిలిపించిన కాబోయే భర్తతో కలిసి అతడిని ఓ యువతి హత్య (Ghaziabad Shocker) చేసింది. యూపీలోని ఘజియాబాద్‌లో వైశాలి సెక్టార్‌ 4లో గతవారం జరిగిన ఈ ఘటనలో బాధితుడిని బీకాం రెండో సంవత్సరం చదువుతున్న నితిన్‌ చౌధరి (26)గా గుర్తించారు. కుల్వీందర్‌ సింగ్‌ అలియాస్‌ సన్నీ అనే వ్యక్తితో ఓ యువతికి నిశ్చితార్ధం జరిగింది.

అయితే తనను పెండ్లి చేసుకోవాలని ఆమెను ప్రియుడు ఒత్తిడి చేయడంతో పాటు బెదిరించాడని పోలీసులు తెలిపారు. ఫిబ్రవరి 6న పార్టీ చేసుకుందామని మహిళ నితిన్‌ను ఆహ్వానించిందని, పార్టీలో ఆమె కాబోయే భర్త సన్నితో పాటు ముగ్గురూ మద్యం సేవించారని ఆపై నితిన్‌ను దారుణంగా హత్య (Ghaziabad murder) చేశారని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో సంబంధం ఉన్నట్టుగా భావిస్తున్న వినోద్‌ కుమార్‌ (56) అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఇక యువకుడిని హత్య చేసిన మహిళ, ఆమె కాబోయే భర్త పరారీలో ఉన్నారు.

ఇంత ఘోరమా..అంబులెన్స్‌లోనే ఎస్ఐ ఆత్మహత్య, ఆస్పత్రిలో చేర్చుకోకపోవడమే కారణం, పోలీస్‌ వర్గాల్లో కలకలం రేపుతున్న ఘటన, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపిన ఢిల్లీ సౌత్ ఈస్ట్ డీసీపీ మీనా

ఫ్లాట్‌లో దుర్వాసన వస్తోందని స్ధొనికులు ఫిర్యాదు చేసిన అనంతరం ఈనెల 10న నితిన్‌ మృతదేహాన్ని పోలీసులు ఘటనా స్ధలం నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఫ్లాట్‌ను అద్దెకు ఇవ్వాలని కోరుతూ స్నేహితుడు వినోద్‌ కుమార్‌కు ఫ్లాట్‌ తాళాలు ఇచ్చానని ఫ్లాట్‌ యజమాని పోలీసులకు తెలిపారు. నాలుగేళ్ల పాటు ఆ మహిళతో నితిన్‌ సహజీవనం చేశాడని, రెండు నెలల కిందట నితిన్‌ను ఆమె దూరం పెట్టిందని విచారణలో వినోద్‌ పేర్కొన్నారు. యమునా విహార్‌కు చెందిన సన్నీతో ఆమెకు ఇటీవల నిశ్చితార్థమైందని చెప్పారు. సన్నీ సాయంతో నితిన్‌ను చంపేందుకు ఆమె కుట్ర పన్నిందని తెలిపారు.

(The above story first appeared on LatestLY on Feb 14, 2021 08:58 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).