SI Commits Suicide: ఇంత ఘోరమా..అంబులెన్స్‌లోనే ఎస్ఐ ఆత్మహత్య, ఆస్పత్రిలో చేర్చుకోకపోవడమే కారణం, పోలీస్‌ వర్గాల్లో కలకలం రేపుతున్న ఘటన, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపిన ఢిల్లీ సౌత్ ఈస్ట్ డీసీపీ మీనా
Representational Image (Photo Credits: ANI)

Delhi, Feb 14: ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అనారోగ్యంతో ఉన్న ఓ పోలీస్‌ని ఆస్పత్రిలో చేర్చుకునేందుకు ఆస్పత్రి వర్గాలు నిరాకరించడంతో ఆయన అంబులెన్స్‌లోనే ఆత్మహత్యకు (SI Commits Suicide) పాల్పడ్డారు. మూడు ఆస్పత్రులు తిరిగినా చేర్చుకోకపోవడంతో ఆ ఎస్ఐ (Delhi police sub-inspector commits suicide) క్షణికావేశంలో అంబులెన్స్‌లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన వివరాల్లోకెళితే..ఢిల్లీలో రాజ్‌వీర్‌ సింగ్‌ (39) (SI Rajveer Singh) ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. ద్వారకలోని నివాసంలో కుటుంబసభ్యులతో కలిసి నివసిస్తున్న ఆయన ఐదు రోజులుగా సెలవులో ఉన్నారు. ఇక శుక్రవారం అనారోగ్యం చెందడంతో అంబులెన్స్‌ను ఇంటికి పిలిపించారు.

ఆ వెంటనే అంబులెన్స్‌ సమీపంలోని ఓ ఆస్పత్రికి వెళ్లగా ఆయనను చేర్చుకునేందుకు నిరాకరించింది. ఆ తర్వాత మరో ఆస్పత్రికి వెళ్లగా అదే సమాధానం వచ్చింది. చివరకు మూడో ఆస్పత్రికి కూడా వెళ్లగా వాళ్లు కూడా చేర్చుకోం అనడంతో అనారోగ్యంతో బాధలో ఉన్న రాజ్‌వీర్‌ సింగ్‌ అంబులెన్స్‌లో ఉన్న ఓ వస్త్రంతో బలవన్మరణానికి పాల్పడ్డారు. కాగా మృతుడికి తల్లిదండ్రులు, భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

నిద్రమత్తు..రెప్పపాటులో అంతా జరిగిపోయింది, కర్నూలు ఘోర రోడ్డు ప్రమాదంలో 14 మంది మృతి, తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ సీఎం వైయస్ జగన్, బాధితులకు సహాయ సహకారాలు అందించాలని ఆదేశాలు

ఈ ఘటన పోలీస్‌ వర్గాల్లో కలకలం రేపుతోంది. అలర్ట్ అయిన పోలీస్ శాఖ చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించింది. ఈ ఘటనపై తక్షణమే చర్యలు తీసుకుంటున్నట్లు డీసీపీ మీనా (DCP RP Meena) తెలిపారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

అయితే ఆస్పత్రులు ఆయనను ఎందుకు చేర్చుకునేందుకు నిరాకరించాయనే అంశంపై కూడా దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ మీడియాతో చెప్పారు. అయితే కరోనా భయంతోనే ఆస్పత్రులు అతడిని చేర్చుకునేందుకు నిరాకరించాయని తెలుస్తోంది. సకాలంలో చేర్చుకుని ఉంటే ఆయన ప్రాణం దక్కేదని కుటుంబసభ్యులు చెబుతున్నారు.