Operation (Credits: X)

Newdelhi, May 17: కేరళలోని (Kerala) కోజికోడ్‌ మెడికల్‌ కాలేజ్‌ హాస్పిటల్‌ (Medical College Hospital) లో డాక్టర్ల (Doctor) నిర్లక్ష్యం తాజాగా బయటపడింది. ఓ నాలుగేళ్ల బాలికకు పుట్టుకతోనే ఓ చేతికి ఆరు వేళ్లు ఉన్నాయి. చిన్న శస్త్ర చికిత్స చేసి, ఆరో వేలును తొలగించవచ్చునని వైద్యులు చెప్పడంతో చిన్నారి తల్లిదండ్రులు అంగీకరించారు. ఈ క్రమంలో బాలికను వెంటపెట్టుకొని బుధవారం కోజికోడ్‌ మెడికల్‌ కాలేజ్‌ హాస్పిటల్‌ వైద్యులను సంప్రదించారు. ఫార్మాలిటీస్ పూర్తిచేశాక బాలికకు వైద్యులు ఆపరేషన్‌ చేశారు.

మరో 5 రోజులు తెలంగాణకు ఎల్లో అలర్ట్, దంచి కొట్టిన వానలకు హైదరాబాద్ నగరం విలవిల, పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జాం

ఆ తర్వాత షాక్

ఆపరేషన్‌ థియేటర్‌ నుంచి బయటకొచ్చిన పాపను చూసి తల్లిదండ్రులు షాక్ అయ్యారు. చేతి ఉండాల్సిన ప్లాస్టర్.. నోటికి ఉండటంతో అవాక్కయ్యారు. విషయం ఏంటని తెలుసుకునేలోపే థియేటర్ నుంచి హడావుడిగా ఓ డాక్టర్‌ వచ్చాడు.  పొరపాటు జరిగిందని, క్షమించాలని బాలిక కుటుంబసభ్యులను కోరారు. బాలికకు గల ఆరో వేలును తొలగిస్తానని చెప్పి ఆ బాలికను వెంటనే మళ్లీ తీసుకెళ్లిపోయారు. దీంతో ఫ్యామిలీ మరోసారి షాక్ కి గురైంది. తమ బిడ్డ వేలికి బదులు నాలుకకు వైద్యులు ఆపరేషన్ చేశారని ఆరోపించారు. ఈ సంఘటనపై దర్యాప్తునకు అధికారులు ఆదేశించారు.

మే 31న కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు, వర్షాలపై గుడ్ న్యూస్ చెప్పిన వాతావరణ శాఖ