Anjali Arora: నెట్టింట్లో అంజలి అసభ్యకర వీడియో.. కన్నీరు పెట్టుకున్న సోషల్ మీడియా సెలబ్రెటి.. ఇలా ఎందుకు చేస్తారంటూ ఆవేదన
నెట్టింట్లో అంజలి అసభ్యకర వీడియో.. నిజజీవితంలో అంజలితో సన్నిహితంగా ఉండే వ్యక్తి కూడా ఆ వీడియోలోనే.. అసలేమైంది. దీనిపై అంజలి ఏమన్నది?
Hyderabad, August 15: సోషల్ మీడియాలో షార్ట్ వీడియోలతో గుర్తింపు తెచ్చుకున్న అంజలి అరోరా (Anjali Arora)కు సంబంధించిన ఒక ప్రైవేట్ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. అంజలి అరోరా ఎమ్‌ఎమ్‌ఎస్ (Anjali Arora MMS) పేరిట ఒక అసభ్యకర వీడియో నెట్టింట్లో లీక్ అయింది. ఆ వీడియోలో (Video) అంజలి ముఖం స్పష్టంగా కనిపించడం, ఆమెతో నిజజీవితంలో సన్నిహితంగా మెలిగే వ్యక్తి ఆ వీడియోలో ఉండటంతో అది నిజమైన వీడియోగా అందరు భావిస్తున్నారు.
ఈ క్రమంలో ఆ వీడియోపై స్పష్టతనిస్తూ అంజలి ఎమోషనల్ అయింది. 'ఆ వీడియోలో ఉంది నేను కాదు. ఆ వీడియోలో నా ఫొటో (Photo) అతికించి, కావాలనే వైరల్ చేస్తున్నారు. అసలు ఎందుకిలా చేస్తున్నారో అర్థం కావట్లేదు. నాకూ ఓ ఫ్యామిలీ ఉంది. మా ఇంట్లో వాళ్లు కూడా ఈ వీడియోలు చూస్తారని కనీసం ఆలోచించకుండా ఇలాంటివి చేయడం దారుణం. ఇలాంటి వాటిని తట్టుకునే శక్తి నాకు లేదు' అని ఎమోషనలై కన్నీరు పెట్టుకుంది అంజలి అరోరా.
(The above story first appeared on LatestLY on Aug 15, 2022 10:45 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

