Jr Ntr: ఆస్కార్ బరిలో జూనియర్ ఎన్టీఆర్.. హాలీవుడ్ మ్యాగజైన్ కథనం.. అభిమానులు ఫుల్ ఖుష్.. ఏ క్యాటగిరీలో అవార్డు రావొచ్చు??
NTR (Photo Credits: Twitter)

Hyderabad, August 14: తెలుగు తెరపై తనదైన ముద్ర వేసి అంతులేని అభిమానాన్ని సంపాదించుకున్న యువ నటుల్లో ఎన్టీఆర్( Jr NTR) ముందు వరుసలో ఉంటారు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాలో తారక్ కొమురం భీమ్ పాత్రలో నటించి మెప్పించారు. కొమురం భీమ్ పాత్రలో తారక్ నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ ను ఆకట్టుకుంది.

ఎన్టీఆర్, చరణ్ లేటెస్ట్ సెన్సేషన్.. 'ఆర్‌ఆర్‌ఆర్‌'కు గూగుల్ స్పెషల్ సర్‌ప్రైజ్‌! మీరు కూడా ఫిదా అవుతారు..

తాజాగా హాలీవుడ్ కు చెందిన వెరైటీ అనే మ్యాగజైన్ తారక్ గురించి ప్రస్తావించింది. తారక్ నటనకు ఆస్కార్ (Oscar) వచ్చే అవకాశం ఉంది అని సదరు మ్యాగజైన్ రాసుకొచ్చింది. `ర్యాంక్ లేని` విభాగంలో ఆస్కార్ ఉత్తమ నటుడు అవార్డుకు అవకాశం ఉన్న పోటీదారులలో జూనియర్ ఎన్టీఆర్ ను ఒకరిగా వెరైటీ మ్యాగజైన్ రాసుకొచ్చింది. దీంతో తారక్ అభిమానులంతా ఫుల్ ఖుష్ అవుతున్నారు.