రాజమౌళి లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'ఆర్‌ఆర్‌ఆర్‌' గురించి సెర్చ్‌ చేసే వారికి గూగుల్ లో ఒక సర్‌ప్రైజ్‌ కనిపిస్తుంది. ఆర్ఆర్‌ఆర్‌ అని గూగుల్‌లో టైప్‌ చేసి ఎంటర్‌ కొట్టగానే సెర్చ్‌ బార్‌ కింద ఒక బైక్‌, గుర్రం వెళ్తూ కనిపిస్తాయి. ఒకసారి బైక్‌ ముందు వస్తే, మరోసారి గుర్రం ముందు వస్తుంది. 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో తారక్ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ నడపగా, రామ్‌ చరణ్‌ గుర్రంపై స్వారీ చేసిన విషయం తెలిసిందే. అలాగే బైక్‌పై రామ్ చరణ్‌, గుర్రంపై ఎన్టీఆర్‌ వెళ్లే సన్నివేశాలు చిత్రంలో ఆకట్టుకున్నాయి. మొత్తంగా ఇటు నందమూరి, అటు మెగా అభిమానులను, ప్రేక్షకులకు ఈ సన్నివేశాలు గుర్తు తెచ్చేలా గూగుల్‌ ఈ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ఈ సర్‌ప్రైజ్‌ ఇచ్చిన గూగుల్‌కు 'ఆర్‌ఆర్‌ఆర్‌' మూవీ టీమ్‌ ధన్యవాదాలు చెప్పింది. ఆ ట్వీట్ ను మీరూ చూడండి..

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)