బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan) ప్రధాన పాత్రలో, ఎన్టీఆర్ మరో పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘వార్-2’(war-2).కియారా అద్వానీ (Kiara Advani)హీరోయిన్‌గా నటించింది. యశ్ రాజ్ ఫిల్మ్స్: స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందిన ఈ మూవీ ‘వార్’కి సీక్వెల్‌గా వచ్చింది. ఆగస్టు 14న భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద అంతగా ప్రభావం చూపలేదు. అలాగే పలు విమర్శలు ఎదుర్కొంది. అయితే ‘వార్-2’ ఇంకా ఓటీటీలోకి రాలేదు.

పవన్ ఫ్యాన్స్ రచ్చ.. ‘OG' సినిమా ప్రీమియర్స్ చూసేందుకు వచ్చి కత్తితో స్క్రీన్ చింపేసిన అభిమానులు, బెంగళూరులో KR పురంలో ఘటన , షో నిలిపివేత

తాజాగా ‘వార్-2’ ఓటీటీ స్ట్రీమింగ్‌పై సంస్థ అధికారికంగా ప్రకటించింది. ‘‘ఆవేశాన్ని రెట్టింపు చేసుకోండి. కోపాన్ని రెట్టింపు చేసుకోండి. యుద్ధానికి సిద్ధంగా ఉన్నారా?’’ అనే క్యాప్షన్ దీనికి జత చేశారు. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. అక్టోబర్ 9 నుంచి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు వెల్లడించారు. థియేటర్స్‌లో విడుదలైన 8వారాల తర్వాత ఓటీటీలోకి రాబోతుంది.

‘War 2’ OTT Release Date:

 

View this post on Instagram

 

A post shared by Netflix India (@netflix_in)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)