అమెరికా పర్యటనలో భాగంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ.. డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ(Trump Criticises Zelensky) అయ్యారు. ఈ క్రమంలో ఇద్దరూ దేశాధినేతలు మీడియా ముందే వాదించుకున్నారు. జెలెన్ స్కీ యుద్ధకాంక్షతో ఉన్నారని దీనివల్ల మూడో ప్రపంచ యుద్ధం వచ్చే ఛాన్స్ ఉందని ట్రంప్ సీరియస్ అయ్యారు. రష్యాతో శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని ప్రతిపాదించారు.
ఒప్పందం చేసుకో లేదంటే మేము బయటకు వెళ్లిపోతాం అంటూ జెలెన్ స్కీకి ట్రంప్ (Trump Zelensky Meet)తేల్చి చెప్పారు. ట్రంప్ తీరు పట్ల జెలెన్ స్కీ అభ్యంతరం వ్యక్తం చేశారు. మా దేశంలో మేము ఉంటున్నామని .. ఎవరికీ తల వంచే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు జెలెన్ స్కీ.
సైనికులు చనిపోతున్నారని, నీ దగ్గర శక్తిలేదని జెలెన్‌స్కీని నిలదీశారు. కాల్పుల విరమణ పాటిస్తే, రక్తపాతాన్ని ఆపవచ్చు అన్నారు ట్రంప్.ఇక వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
War of Words Between US President Donald Trump and Ukraine President Zelensky – Viral Video
I recommend watching the full conversation between Trump and Zelensky before forming strong opinions
(This is true for any situation)
— Shaun Maguire (@shaunmmaguire) February 28, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)