ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీతో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోనులో మాట్లాడారు. వీరిద్దరి మధ్య దాదాపు 35 నిమిషాల పాటు సంభాషణ కొనసాగింది. ఉక్రెయిన్ నుంచి భారత పౌరుల తరలింపులో సాయం పట్ల జెలెన్ స్కీకి మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికీ కొందరు భారత పౌరులు ఉక్రెయిన్‌లోనే ఉండడంతో భారత పౌరుల తరలింపులో నిరంతరం సహకారం ఉండాలని మోదీ కోరారు. ఉక్రెయిన్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై మోదీకి జెలెన్ స్కీ వివరించారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య ప్రతక్ష చర్చలు జరుగుతోన్న తీరును మోదీ అభినందించారు. దౌత్య మార్గాల్లో సమస్యలను పరిష్కరించాలని ఆయన చెప్పారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Prime Minister Modi spoke on phone to President Volodymyr Zelensky of Ukraine.The phone call lasted for about 35 minutes. The two leaders discussed the evolving situation in Ukraine. PM appreciated the continuing direct dialogue between Russia & Ukraine: GoI Sources
(File pics) pic.twitter.com/oCej7bZZzB
— ANI (@ANI) March 7, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)