Pakistan Woman Viral Dance Video gives message After Divorce(X)

Delhi, Feb 28:  విడాకులు పొందిన తర్వాత ఎలా జీవించాలో ఓ డ్యాన్స్ రూపంలో తెలిపింది పాకిస్థాన్‌కు చెందిన ఓ తల్లి(Pakistan Woman Viral Dance Video). ముగ్గురు పిల్లల తల్లి అయిన అజీమా ఇహ్సాన్ విడాకుల తర్వాత మహిళల జీవితం ఎలా ఉండాలి అనే అంశాన్ని వివరిస్తూ అద్భుతమమైన డ్యాన్స్‌తో ఆకట్టుకుంది(viral dance video). తన అనుభవాన్ని నృత్యరూపంలో వ్యక్తపరుస్తూ ధైర్యం, సహనశీలత, స్వేచ్ఛ అనే సందేశాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది.

సంప్రదాయ వస్త్రధారణలో అద్భుతంగా డ్యాన్స్‌ చేస్తూ తన భావోద్వేగాలను వ్యక్తపరిచింది. ఆమె నృత్యాన్ని చూసిన ప్రేక్షకులు చప్పట్లతో స్పందిస్తూ ఆమె ధైర్యానికి ప్రశంసలు గుప్పించారు.

నేపాల్‌ లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.1గా న‌మోదు.. వరుస భూకంపాలతో భయాందోళనలో ప్రజలు (వీడియో) 

అజీమా తన సోషల్ మీడియా పోస్ట్‌లో విడాకులను ఓ వైఫల్యంగా కాకుండా, కొత్త జీవితానికి ఓ అవకాశంగా చూడాలని చెప్పింది. ఇది కఠినమైన ప్రయాణమే అయినా, అశాంతిలో మగ్గిపోతున్న పెళ్లిలో జీవించడం కంటే ఇది ఎంతో మెరుగైనదని తెలుసుకున్నాను. నాకు, నా ముగ్గురు పిల్లలకు విడాకులు స్వేచ్ఛను ఇచ్చాయి. నా మాజీ భర్తకు కూడా ఇదే సరైన నిర్ణయం అని ఆమె చెప్పింది. వివాహం ప్రేమ, గౌరవంపై ఆధారపడాలి... సమాజ భయంతో బాధలో మిగిలిపోవాల్సిన అవసరం లేదు. చాలా మంది పాకిస్థానీ మహిళలు విడాకులు అనే లేబుల్‌కు భయపడి తమను త్యాగం చేసుకుంటున్నారని చెప్పారు.

Pakistan Woman Viral Dance Video gives message After Divorce

 

 

View this post on Instagram

 

A post shared by Λzima (@azima_ihsan)

ఈ వీడియోను రెండు రోజుల క్రితం షేర్ చేయగా ఇప్పటివరకు 1.4 మిలియన్ వ్యూస్ సాధించింది. సోషల్ మీడియాలో నెటిజన్లు సైతం ఆమె ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని ప్రశంసిస్తూ ఎంతోమందికి ప్రేరణగా నిలిచారని కొనియాడుతున్నారు.