Mahesh Babu: స్విట్జర్లాండ్‌  వెకేషన్‌ నుంచి హైదరాబాద్ లో ల్యాండ్ అయిన మహేష్..కొత్త మేకోవార్ లో హల్ చల్
Mahesh (Image Credits: Pinkvilla)

Hyderabad, August 6: స్విట్జర్లాండ్‌లో వెకేషన్‌కు ప్యాకప్‌ చెప్పి సూపర్ స్టార్ (Super Star) మహేశ్‌బాబు (Mahesh Babu) శుక్రవారం హైదరాబాద్ లో ల్యాండ్‌ అయ్యారు. గత నెల ఫ్యామిలీ (Family)తో కలిసి మహేశ్‌ ఫారిన్‌ ట్రిప్ కు వెళ్లారు. ముందు లండన్‌ వెళ్లి, ఆ తర్వాత స్విట్జర్లాండ్‌లో గడిపారు. కాగా మహేశ్‌బాబు తర్వాతి సినిమా త్రివిక్రమ్‌ (Trivikram) దర్శకత్వంలో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.

‘లైగర్‌’ సెన్సార్‌ పూర్తి.. సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు ఏమన్నారు? ఏ సర్టిఫికేట్ ఇచ్చారు? థియేట్రికల్‌ రన్‌టైం ఎంతంటే..!

ఈ చిత్రం కోసం మహేశ్‌బాబు కొత్తగా మేకోవర్‌ అవుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మహేశ్‌ గడ్డంతో (Beard) ఉన్న లుక్స్‌ వైరల్‌ అవుతుండటంతో ఈ న్యూ మేకోవర్‌ ప్రచారానికి మరింత బలం చేకూరినట్లయింది. అలాగే ఈ సినిమా (Movie) కోసం మహేశ్‌  కాస్త బరువు కూడా తగ్గుతున్నట్లుగా తెలిసింది. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించనున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.