Liger: ‘లైగర్’ సెన్సార్ పూర్తి.. సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు ఏమన్నారు? ఏ సర్టిఫికేట్ ఇచ్చారు? థియేట్రికల్ రన్‌టైం ఎంతంటే..!
సెన్సార్ వర్క్ ను పూర్తి చేసుకున్న లైగర్.. సినిమాపై సెన్సార్ సభ్యుల ప్రశంసలు
Hyderabad, August 5: పూరీ జగన్నాథ్, హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో రూపొందిన క్రేజీ చిత్రం లైగర్. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించిన ఈ చిత్రం ఆగస్ట్ 25న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ వర్క్ ను కూడా పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. సెన్సార్ బోర్డ్ ప్రకారం లైగర్ చిత్రం దాదాపు 2 గంటల 20 నిమిషాల రన్ టైమ్ ఉన్నట్లు తెలుస్తోంది.
వామ్మో.. మరో నటి టాప్ లెస్ ఫోటో షూట్.. అంతేనా వివాదాస్పద క్యాప్షన్ కూడా..
యాక్షన్ సీక్వెన్స్, పాటలతోపాటు.. మూవీలోని మరిన్ని సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోనున్నాయంటున్నారు సెన్సార్ సభ్యులు. బాక్సర్‌గా విజయ్ అదరగొట్టాడని, విజయ్ తల్లిగా రమ్యకృష్ణ పాత్ర స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనుందట. ఈ సినిమాకు యూఏ సర్టిఫికేట్ జారీ చేశారు.
(The above story first appeared on LatestLY on Aug 05, 2022 09:09 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

