International Yoga Day: అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న ప్రధాని మోదీ.. కేంద్ర మంత్రులు, ప్రముఖులు.. (వీడియోతో)

నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఈ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జమ్ముకశ్మీర్‌ లోని శ్రీనగర్‌ లో నిర్వహించిన యోగా డే కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.

International Yoga Day: అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న ప్రధాని మోదీ.. కేంద్ర మంత్రులు, ప్రముఖులు.. (వీడియోతో)
PM Modi (Credits: X)

Srinagar, June 21: నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం (International Yoga Day). ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఈ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జమ్ముకశ్మీర్‌ లోని (Jammu Kashmir) శ్రీనగర్‌ లో నిర్వహించిన యోగా డే కార్యక్రమంలో ప్రధాని మోదీ (PM Modi) పాల్గొన్నారు. ప్రముఖ పర్యాటక కేంద్రం దాల్‌ సరస్సు ఒడ్డున ప్రజలతో కలిసి యోగాసనాలు వేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. జపాన్‌ లోని సుజుకి హాంగ్వాన్జీ ఆలయం వద్ద భారత ఎంబసీ ఆధ్వర్యంలో యోగా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జపాన్‌ కు చెందిన పలువురు నాయకులు, అధికారులు, యోగా ఔత్సాహితులు పాల్గొన్నారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మీ బంధు మిత్రులకు Photo Greetings ద్వారా శుభాకాంక్షలు తెలియజేయండిలా..

కేంద్రమంత్రులు కూడా యోగా డేలో ఉత్సాహంగా పాల్గొన్నారు. మంత్రులు రాజ్‌ నాథ్‌ సింగ్‌, శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, నితిన్‌ గడ్కరి, జైశంకర్‌, కిషన్‌ రెడ్డి, అమిత్‌ షా, జేపీ నడ్డా, ప్రహ్లాద్‌ జోషి, పీయుష్‌ గోయల్‌, ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వినయ్‌ కుమార్‌ సక్సేనా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, బీజేపీ ఎంపీ, సీనియర్‌ నటి హేమా మాలిని, ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్‌ తో పాటు కశ్మీర్‌ లోని ప్యాంగాంగ్‌ సరస్సు వద్ద సైనికులు యోగా దినోత్సవంలో పాల్గొన్నారు.

వీడియో ఇదిగో, పట్టపగలు బురఖా ధరించి బంగారం షాపులో చోరి, యజమాని ప్రతిఘటించడంతో కత్తితో దాడి

(The above story first appeared on LatestLY on Jun 21, 2024 09:35 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).