Maharashtra Shocker: ప్రియురాలిని సెక్స్‌లో మరింతగా సుఖపెట్టాలనే తాపత్రయం, మందు తాగి రెండు వయాగ్రా మాత్రలు వేసుకుని రక్తపు వాంతులతో ఓ వ్యక్తి మృతి

మహారాష్ట్రలోని నాగపూర్ లో దారుణం చోటు చేసుకుంది. త‌న ప్రియురాలిని మరింతగా సుఖపెట్టాలని ఆశతో శృంగార సామ‌ర్థ్యాన్ని పెంచుకునేందుకు మ‌ద్యం సేవిస్తూ వ‌యాగ్రా పిల్స్( Viagra Pills ) వేసుకున్నాడు. దీంతో అత‌ని ర‌క్తం గ‌డ్డ క‌ట్ట‌డంతో ప్రాణాలు కోల్పోయాడు.

Maharashtra Shocker: ప్రియురాలిని సెక్స్‌లో మరింతగా సుఖపెట్టాలనే తాపత్రయం, మందు తాగి రెండు వయాగ్రా మాత్రలు వేసుకుని రక్తపు వాంతులతో ఓ వ్యక్తి మృతి
Viagra (Wikimedia Commons)

Nagpur, Mar 7: మహారాష్ట్రలోని నాగపూర్ లో దారుణం చోటు చేసుకుంది. త‌న ప్రియురాలిని మరింతగా సుఖపెట్టాలని ఆశతో శృంగార సామ‌ర్థ్యాన్ని పెంచుకునేందుకు మ‌ద్యం సేవిస్తూ వ‌యాగ్రా పిల్స్( Viagra Pills ) వేసుకున్నాడు. దీంతో అత‌ని ర‌క్తం గ‌డ్డ క‌ట్ట‌డంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘ‌ట‌న నాగ్‌పూర్‌( Nagpur)లో చోటు చేసుకున్న‌ట్లు ఫోరెన్సిక్, లీగ‌ల్ మెడిసిన్ జ‌ర్న‌ల్‌లో ప్ర‌చురిత‌మైంది.

41 ఏండ్ల వ‌య‌సున్న ఓ వ్య‌క్తి త‌న ప్రియురాలితో క‌లిసి ఓ హోట‌ల్‌కు వెళ్లాడు. అక్క‌డ ప్రియురాలితో సెక్స్ ఎంజాయ్ చేసే క్రమంలో ఆ రాత్రి మ‌ద్యం సేవించాడు. మందులోనే 50 ఎంజీ చొప్పున ఉన్న‌ రెండు వ‌యాగ్రా పిల్స్‌ను వేసుకున్నాడు. ఆ రాత్రంతా వ్య‌క్తి బాగానే ఉన్న‌ప్ప‌టికీ తెల్లారేస‌రికి తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యాడు. తెల్ల‌వారుజామున వాంతులు చేసుకున్నాడు.

భార్యను చంపి శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికిన భర్త, వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానమే కారణం, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

దీంతో ఆస్ప‌త్రికి వెళ్దామ‌ని ప్రియురాలు చెప్పిన‌ప్ప‌టికీ అత‌ను వినిపించుకోలేదు. గ‌తంలోనూ ఇలాగే అయింద‌ని చెప్పి ఊరుకున్నాడు. ఆ త‌ర్వాత కొద్దిసేప‌టికే అత‌ను తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యాడు. ఒక్కసారిగా పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించారు. కానీ దురదృష్టవశాత్తు, అతను ఆస్పత్రికి వచ్చేలోపు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.

మనిషి మెదడుకు ఆక్సిజన్ డెలివరీ తగ్గిపోయినప్పుడు సెరెబ్రోవాస్కులర్ హెమరేజ్‌తో మరణించాడని వైద్యులు తెలిపారు. వ‌యగ్రా పిల్స్ వేసుకోవ‌డం వ‌ల్ల క్ర‌మ‌క్ర‌మంగా అత‌ని మెద‌డుకు ఆక్సిజ‌న్( Oxygen ) స‌ర‌ఫ‌రా త‌గ్గిపోయి సెరెబ్రోవాస్కుల‌ర్ హెమ‌రేజ్( cerebrovascular haemorrhage ) ఏర్ప‌డ‌టంతో.. అత‌ను చ‌నిపోయిన‌ట్లు వైద్యులు నిర్ధారించారు.

రండి బాబూ.. రండి.. ఫోన్లు కొంటే ఉచిత బీర్ అంటూ వ్యాపారి ఆఫర్‌.. ఎగబడ్డ జనం, చివరకు వ్యాపారిని అరెస్టు చేసిన పోలీసులు.. ఎందుకు??

మ‌ద్యంతో క‌లిపి వ‌య‌గ్రా తీసుకోవ‌డం వ‌ల్ల అధిక ర‌క్త‌పోటుకు గుర‌య్యాడ‌ని, తద్వారా ప్రాణాలు కోల్పోయాడ‌ని తెలిపారు. వైద్యుల‌ సలహా లేకుండా అంగస్తంభన కోసం మెడిసిన్స్ తీసుకోవడం వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన కల్పించేందుకు ఈ అరుదైన కేసును ప్రచురించినట్లు జ‌ర్న‌ల్‌లో పేర్కొన్నారు. పోస్ట్‌మార్టం స్కానింగ్‌లో 300 గ్రాముల రక్తం గడ్డకట్టినట్లు వైద్యులు గుర్తించారు. ఆల్కహాల్, మందుల మిశ్రమం, అలాగే ముందుగా ఉన్న అధిక రక్తపోటు అతని మరణానికి దారితీసిందని వారు నిర్ధారించారు.

(The above story first appeared on LatestLY on Mar 07, 2023 04:57 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).