Lucknow, March 7: ఫోన్ల సేల్స్ (Phone Sales) పెంచుకోవాలని, తద్వారా లాభాలు (Profits) అందుకోవాలని ఉత్తరప్రదేశ్‌లో (Uttarpradesh) బదోహీ జిల్లాకు చెందిన షాపు యజమాని రాజేశ్ మౌర్య అనుకున్నాడు. ఈ క్రమంలో మార్చి 3 నుంచి 7వ తారీఖుల్లో తన షాపులో ఫోన్లు కొన్నవారికి రెండు బీర్ క్యాన్లు (Beer cans) ఉచితంగా ఇస్తానని భారీగా ప్రచారం చేసుకున్నాడు.
దీంతో.. జనం ఎగబడ్డారు. మౌర్య షాపు ముందు ఒకటే రచ్చ. దీంతో.. ట్రాఫిక్‌కు భారీస్థాయిలో అంతరాయం ఏర్పడింది. ఇంకేముంది.. పోలీసులు రంగంలోకి దిగారు. ట్రాఫిక్ కు అంతరాయం కలిగించి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాడని మౌర్యను ఐపీసీ సెక్షన్ 151 కింద అరెస్టు చేశారు. ఆయన దుకాణాన్ని సీల్ వేశారు.
UP shopkeeper offers 'free' beer on purchase of smartphone; arrested after huge crowd gathers at shophttps://t.co/vIGorxtCvK
— TIMES NOW (@TimesNow) March 7, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)